AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: నన్నే కొడతావా..వృద్ధుడిని వెంటాడి దాడి చేసిన ఎద్దు… అంతకు ముందు ఏం జరిగిందో చూడండి…

పిల్లిని గదిలో బంధించి కొడితే పులిగా మారి తిరగబడుతుంది అంటారు. ఇక్కడ ఓ ఎద్దు అలాగే చేసింది. మంగళవారం, డిసెంబర్ 16న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక ఎద్దు వృద్ధుడిపై దాడి చేసింది. కెమెరాలో రికార్డయిన ఈ సంఘటనలో ఎద్దు ప్రశాంతంగా వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా ఆ వృద్ధుడు ఒక రాయిని...

viral video: నన్నే కొడతావా..వృద్ధుడిని వెంటాడి దాడి చేసిన ఎద్దు... అంతకు ముందు ఏం జరిగిందో చూడండి...
Bull Hit Old Man
K Sammaiah
|

Updated on: Dec 27, 2025 | 5:14 PM

Share

పిల్లిని గదిలో బంధించి కొడితే పులిగా మారి తిరగబడుతుంది అంటారు. ఇక్కడ ఓ ఎద్దు అలాగే చేసింది. మంగళవారం, డిసెంబర్ 16న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక ఎద్దు వృద్ధుడిపై దాడి చేసింది. కెమెరాలో రికార్డయిన ఈ సంఘటనలో ఎద్దు ప్రశాంతంగా వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా ఆ వృద్ధుడు ఒక రాయిని తీసుకుని ఆ జంతువును కొట్టడం కనిపిస్తుంది. దీంతో ఎద్దుకు కోపం వచ్చి, తిరిగి ఆ వృద్ధుడిని వెంబడించి అతనిపై దాడి చేసింది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో వెలుగులోకి వచ్చాయి.

వైరల్ అవుతున్న క్లిప్‌లో మొదట ఎద్దు ప్రశాంతంగా వీధిలో నడుచుకుంటూ వెళ్తుండటం కనిపిస్తుంది. ఇంటిలో నుంచి వీధిలోకి వచ్చిన వృద్దుడు అకస్మాత్తుగా ఒక రాయిని తీసుకుని ఆ ఎద్దును కొట్టడం కనిపిస్తుంది. దీంతో ఎద్దుకు కోపం వచ్చి, తిరిగి ఆ వృద్ధుడిని వెంబడించి అతనిపై దాడి చేసింది. బాధితుడిని మేఘరాజ్ సింగ్‌గా గుర్తించారు, అతను గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

వృద్దుడిపై ఎద్దు దాడి చేస్తుండగా స్థానికులు వచ్చి అడ్డుకుంటారు. ఎద్దును అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో వృద్దుడు ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ఆ ఎద్దు వృద్దుడిని కొమ్ములతో ఎత్తి పడేసేదేనని అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియో పట్ల నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి: