Low Safety Rated: భద్రత విషయంలో ఆ కార్లు ఫెయిల్.. క్రాష్ టెస్ట్ ఫలితాల్లో అతి తక్కువ రేటింగ్

పిండి కొద్దీ రొట్టె అనే చందాన తక్కువ ధరకు అందుబాటులో ఉండే కార్లు తక్కువ ఫీచర్లతో వస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో అందుబాటులో ఉన్న మహీంద్రా బొలెరో నియో, హోండా అమేజ్, సిట్రోయెన్ ఈ-సీ3కు సంబంధించిన ఇటీవలి గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలతో భారతదేశంలో విక్రయించే వాహనాల భద్రత అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. సిట్రియోన్ ఈసీ3 పేలవమైన పనితీరును కలిగి ఉండగా హోండా అమేజ్ కొంచెం మెరుగ్గా ఉంది.

Low Safety Rated: భద్రత విషయంలో ఆ కార్లు ఫెయిల్.. క్రాష్ టెస్ట్ ఫలితాల్లో అతి తక్కువ రేటింగ్
Ncap Rating
Follow us

|

Updated on: Apr 26, 2024 | 5:15 PM

ఇటీవల కాలంలో కార్ల వినియోగం బాగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా అన్ని కంపెనీలు సరికొత్త కార్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే పిండి కొద్దీ రొట్టె అనే చందాన తక్కువ ధరకు అందుబాటులో ఉండే కార్లు తక్కువ ఫీచర్లతో వస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో అందుబాటులో ఉన్న మహీంద్రా బొలెరో నియో, హోండా అమేజ్, సిట్రోయెన్ ఈ-సీ3కు సంబంధించిన ఇటీవలి గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలతో భారతదేశంలో విక్రయించే వాహనాల భద్రత అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. సిట్రియోన్ ఈసీ3 పేలవమైన పనితీరును కలిగి ఉండగా హోండా అమేజ్ కొంచెం మెరుగ్గా ఉంది. అయితే మహీంద్రా బొలెరో నియో షో అత్యంత నిరాశపరిచింది. ముఖ్యంగా గ్లోబల్ ఎన్‌సీఏపీలో చాలా తక్కువ భద్రతా స్కోర్‌లతో నాలుగు బ్రాండ్‌ల నుంచి నాలుగు వేర్వేరు కార్ల గురించి తెలుసుకుందాం.

మహీంద్రా బొలెరో నియో

స్కార్పియో-ఎన్, ఎక్స్ ‌యూవీ700, థార్, ఎక్స్‌యూవీ 300తో సహా మహీంద్రాకు సంబంధించిన ప్రస్తుత మోడల్ లైనప్ గ్లోబల్ ఎన్‌సీఏపీలో చాలా బాగా పనిచేసింది. బొలెరో నియో కేవలం వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీ, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఒక్కో నక్షత్రాన్ని మాత్రమే పొందింది. ఇది పెద్దల భద్రతలో 34కి 20.26 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కి 12.71 పాయింట్లు సాధించింది.

హోండా అమేజ్

హోండా అమేజ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో రెండు స్టార్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో జీరో స్కోర్ చేసింది. మారుతి సుజుకి డిజైర్-ప్రత్యర్థి పెద్దల భద్రతలో 27.85 పాయింట్లు, పిల్లల భద్రతలో 8.58 పాయింట్లను పొందింది.

ఇవి కూడా చదవండి

సిట్రోయెన్ ఈసీ3

సిట్రోయెన్ ఈసీ3 గ్లోబల్ ఎన్‌సీఏపీలో జీరో స్టార్ సెఫ్టీ రేటింగ్‌ను పొందింది. వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో సున్నా, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఒక స్టార్. ఎలక్ట్రిక్ కారు పెద్దల భద్రతలో 20.86 పాయింట్లు, పిల్లల భద్రతలో 10.55 పాయింట్లు సాధించింది.

మారుతీ సుజుకి ఇగ్నిస్

గ్లోబల్ ఎన్‌సీఏపీ ప్రకారం ఇగ్నిస్ అధ్వానమైన భద్రత రేటెడ్ మారుతీ కారుగా ఉంది. వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఒక స్టార్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో జీరో పొందింది. స్కోర్లు వరుసగా 16.48 పాయింట్లు, పెద్దల భద్రత మరియు పిల్లల భద్రతలో 3.86 పాయింట్లుగా ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..  

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?