Freshers Jobs: ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

ఓవైపు ఆటోమేషన్, మరోవైపు మంద్యం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవడం కూడా ఆపేశాయి కొన్ని కంపెనీలు. ఏకంగా ఐఐటీల్లో కూడా విద్యార్థులు ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే తరుణంలో భారత్‌కు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం టెక్‌ మహీంద్ర శుభవార్త తెలిపింది...

Freshers Jobs: ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
Jobs
Follow us

|

Updated on: Apr 26, 2024 | 10:51 AM

ఓవైపు ఆటోమేషన్, మరోవైపు మంద్యం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవడం కూడా ఆపేశాయి కొన్ని కంపెనీలు. ఏకంగా ఐఐటీల్లో కూడా విద్యార్థులు ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే తరుణంలో భారత్‌కు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం టెక్‌ మహీంద్ర శుభవార్త తెలిపింది.

రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపడతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏరంగా 6000 మంది ఫ్రెషర్‌లను రిక్రూట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమై టెక్‌ మహీంద్ర మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మోహిత్ జోషి మాట్లాడుతూ.. ప్రతీ త్రైమాసికంలో 1500 మంది ఫ్రెష్‌ గ్యాడ్యుయేట్‌లను నియమించుకోనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా తమ ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంచే దిశగా కూడా టెక్‌ మహీంద్ర అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది 50,000 మందికి పైగా ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై శిక్షణ ఇస్తున్నట్లు మోహిత్ జోషి తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా టెక్‌ మహీంద్రా తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది.

గురువారం నాడు వెల్లడించిన ఈ ఫలితాలలో గత ఏడాదితో పోలిస్తే టెక్ మహీంద్రా కంపెనీ నికరణ లాభంలో భారీగా క్షీణత కనబడింది. ఇందులో భాగంగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో కంపెనీ ఏకీకృత నికర లాభం ఏకంగా 40 శాతం పైగా తగ్గడంతో రూ. 661 కొట్లుగా నమోదయింది. ఇకపోతే గత ఏడాది ఇదే త్రైమాసిక ఫలితాలలో కంపెనీ ఏకంగా రూ 1117.7 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఆదాయం 6.2 శాతం తగ్గి రూ. 128071 కోట్లకు పరిమితమైంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..