AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Business: ఎండాకాలం ఈ బిజినెస్ చేస్తే.. పెట్టుబడి పోనూ 2 లక్షల లాభం.. నో రిస్క్..

ఉద్యోగం అయితే ఎప్పుడూ ఒకరి కింద ఉండాల్సిందే. అదే బిజినెస్ అయితే ఇండిపెండెంట్ లైఫ్. మన ఇష్టం. కాస్త తెలివి పెడితే సీజనల్ బిజినెస్ చేసి లక్షలు సంపాదించుకోవచ్చు. మీ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవచ్చు. అలాంటి ఓ వ్యాపార ఐడియా మీ కోసం...

Summer Business: ఎండాకాలం ఈ బిజినెస్ చేస్తే.. పెట్టుబడి పోనూ 2 లక్షల లాభం.. నో రిస్క్..
Currency
Ram Naramaneni
|

Updated on: Apr 26, 2024 | 1:08 PM

Share

సాఫ్ట్‌వేర్ జాబ్స్. MNC కంపెనీల్లో పనిచేసే వాళ్ల గురించి వదిలేయండి. వాళ్లకు ఎలాగూ లక్షల్లో జీతం ఉంటుంది. ఇక నెలకు 40 వేల లోపు జాబ్ మాత్రమే ఉన్నవారి పరిస్థితి మాములుగా ఉండదు. ఈ సిటీల్లో పెరిగిన ఖర్చులకు కుటుంబాన్ని నడపాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. శాలరీ పడగానే EMI, రెంట్, గ్రాసరీ ఖర్చులు అన్నీ పోగా.. అరో కొరో జేబులో మిగులుతుంది. కొందరు అయితే వారంలోనే శాలరీ అయిపోవడంతో.. క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కొద్దిపాటి జాబ్‌లు చేసి.. గొప్ప జీవితం బతకడం అనేది కలే. అందుకే కొంత డబ్బు సేవ్ చేసుకుని.. నష్టం వచ్చే అవకాశమే లేదు అనే బిజినెస్ చేస్తే లైఫ్ కొద్దిగా మారుతుంది. జాబ్ చేస్తూ కూడా ఇలాంటి వ్యాపారాలు ర్ చేయవచ్చు. అలాంటి ఓ ఐడియానే ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాం. బాగా జన సంచారం ఉండే ప్రాంతాన్ని చూసుకుని ఈ బిజినెస్ పెడితే.. ఈ ఎండాకాలం 2నెలల్లో 2 లక్షలు వెనకేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో.

మేం చెప్పేది రీస్కీ బిజినెస్ కూడా కాదండీ. కొబ్బరి బోండాల వ్యాపారం. సమ్మర్‌లో జనం.. కొబ్బరి నీళ్లు బాగా తాగుతారు. హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అందరూ… కూల్‌డ్రింక్స్ వైపు వెళ్లకుండా కొబ్బరి నీళ్లు ఫ్రిపర్ చేస్తారు. అందుకే మీ వద్ద ఒక లక్ష కనుక ఉంటే.. పట్టణాల్లో, సిటీల్లో, ఓ హైవే పక్కనే ఓ పెద్ద నీడ ఉన్న చెట్టు చూసుకుని.. కొబ్బరి బోండాలు బిజినెస్ ఎంచక్కా సెట్ చేసుకోవచ్చు. మనకి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు బెంగళూరు బోండాలు అందుబాటులో ఉన్నాయి.

ఫర్ ఎగ్జాంపుల్.. గోదావరి బోండాల వ్యాపారం పెట్టాలనుకునే మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు అనుకోండి.. ఒక్కో బోండం మీ వద్దకు చేరేసరికి 25 నుంచి 30 రూపాయలు పడుతుంది. ఇక్కడ బోండం 50 నుంచి 60 రూపాయల వరకు సేల్ చేయవచ్చు. అంటే ఒక్కో బోండానికి 20 రూపాయల లాభం ఎటూ పోదు. రోజుకు తక్కువలో తక్కువ 200 కాయ అమ్ముకున్నా.. 4000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. అంటే ఒక నెలకు లక్షా 20 వేలు. పైన 20 వేలు వివిధ కారణాల వల్ల తీసేసుకున్నా లక్ష లాభం ఎటూ పోదు. అలా ఎండాకాలం తీవ్రత ఉండే 2 నెలలు వీటిని అమ్ముకున్నా.. కొద్ది రోజుల్లోనే 2 లక్షలు మీరు వెనకేసుకోవచ్చు. అయితే ఇక్కడ సరైన ప్రాంతం ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎక్కువ వ్యాపారం జరిగితే లాభం కూడా ఆటోమేటిగ్‌గా పెరుగుతుంది.

Coconut

Coconut

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..