Aceman EV: మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్.. ఆకట్టుకుంటున్న డిజైన్

మినీ బీజింగ్ మోటార్ షోకు ముందు కొత్త ఏస్‌మ్యాన్ ఇటీవల సరికొత్త ఈవీని ఆవిష్కరించింది . ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు కొత్త కూపర్ ఈవీ, కంట్రీమ్యాన్ ఈవీల్లో చేరిన ఈవీల బ్రాండ్ లైనప్‌నకు జోడిస్తుంది . ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది లైనప్‌లోని బ్రాండ్‌కు సంబంధించిన పేర్కొన్న మోడల్ మధ్య అంతరాన్ని పూరిస్తుంది. అయితే ఇతరుల మాదిరిగా కాకుండా ఏస్‌మ్యాన్ ప్రత్యేక ఈవీగా అందుబాటులో ఉంది.

Aceman EV: మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్.. ఆకట్టుకుంటున్న డిజైన్
Aceman Ev
Follow us

|

Updated on: Apr 26, 2024 | 5:00 PM

మినీ బీజింగ్ మోటార్ షోకు ముందు కొత్త ఏస్‌మ్యాన్ ఇటీవల సరికొత్త ఈవీని ఆవిష్కరించింది . ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు కొత్త కూపర్ ఈవీ, కంట్రీమ్యాన్ ఈవీల్లో చేరిన ఈవీల బ్రాండ్ లైనప్‌నకు జోడిస్తుంది . ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది లైనప్‌లోని బ్రాండ్‌కు సంబంధించిన పేర్కొన్న మోడల్ మధ్య అంతరాన్ని పూరిస్తుంది. అయితే ఇతరుల మాదిరిగా కాకుండా ఏస్‌మ్యాన్ ప్రత్యేక ఈవీగా అందుబాటులో ఉంది. కూపర్ ఈవీకు మద్దతు ఇచ్చే ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన పొడిగించిన వెర్షన్ ఆధారంగా కారు దాని డిజైన్ అంశాలను గతంలో ఆవిష్కరించిన ఏస్‌మ్యాన్ కాన్సెప్ట్ పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏస్‌మ్యాన్ ఈవీకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

మినీ ఏస్‌మ్యాన్  ఈవీ చాలా మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ కారుకు వచ్చే బంపర్ డిజైన్‌ అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ కారు బాడీ క్లాడింగ్ ఈవీకి చంకీ రూపాన్ని అందిస్తాయి. మినీ కూపర్‌తో పోల్చినప్పుడు ఏస్‌మ్యాన్ ఈవీ కొంచెం పెద్దగా ఉంటుంది. అయితే పెద్ద కంట్రీమ్యాన్‌తో పోల్చినప్పుడు నిష్పత్తి తక్కువగా ఉంటుంది. స్కేల్లో కారు పొడవు 4.07 మీటర్లు, వెడల్పు 1.75 మీటర్లు, ఎత్తు 1.5 మీటర్లుగా ఉంటుంది. కొత్త మినీ ఇంటీరియర్ డిజైన్ వారి ఇతర మోడళ్లకు అనుగుణంగా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం సెంట్రల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ముఖ్యంగా స్టీరింగ్ వీల్ ముందు ఉన్న హెడ్-అప్ డిస్ ప్లే కోసం రిఫ్లెక్టివ్ ప్యానెల్ ఉంది.

మినీ ఏస్‌మ్యాన్ ఈవీ రెండు వేరియంట్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. వీటిలో బేస్ వేరియంట్ ఈ 42.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఇది 310 కిలోమీటర్ల డబ్ల్యూటీపీ పరిధిని అందిస్తుంది. ఇది 181 బీహఎచ్‌పీ, 290 ఎన్ఎం పవర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. అందువల్ల కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 7.9 సెకన్లలో అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లుగా ఉంది.  ఏస్‌మ్యాన్ టాప్ వేరియంట్‌ను ఎస్ఈ వెర్షన్‌గా పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ 54.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 405 కిమీల డబ్ల్యూఎల్‌టీపీ పరిధిని అందిస్తుంది. ఈ కారు 215 బీహెచ్‌పీ పవర్, 330 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ కారు 0-100 కిలోమీటర్లను 7.1 సెకన్లలో అందుకుటుంది. ఈ కారు గరిష్ట వేగం 170 కిలోమీటర్లుగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..  

Latest Articles