AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulsar NS400: పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఎన్ఎస్ 400 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్చ్..!

మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పల్సర్ బైక్‌ను బజాజ్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా 2024 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400 వేరియంట్ అందుబాటులో ఉండనుంది. బజాజ్ మే 3వ తేదీన అత్యంత శక్తివంతమైన పల్సర్2ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ ఫీచర్స్‌ను పేర్కొంటూ ఇటీవల బజాజ్ కంపెనీ రిలీజ్ చేసిన తాజా టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది.

Pulsar NS400: పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఎన్ఎస్ 400 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్చ్..!
Pulsar Ns400
Nikhil
|

Updated on: Apr 26, 2024 | 4:45 PM

Share

భారతదేశంలో యువత ఎక్కువ బైక్ రైడింగ్ అంటే ఆసక్తి చూపుతూ ఉంటారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ఎవరికి వారు బైక్ రైడింగ్ అంటే ఇష్టపడతారు. అయితే రైడింగ్ అంటే ఆసక్తి ఉన్న వారికి బజాజ్ కంపెనీకు సంబంధించిన పల్సర్ బైక్ మంచి ప్రత్యామ్నాయంగా అవతరించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పల్సర్ బైక్‌ను బజాజ్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా 2024 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400 వేరియంట్ అందుబాటులో ఉండనుంది. బజాజ్ మే 3వ తేదీన అత్యంత శక్తివంతమైన పల్సర్2ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ ఫీచర్స్‌ను పేర్కొంటూ ఇటీవల బజాజ్ కంపెనీ రిలీజ్ చేసిన తాజా టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బజాజ్ రిలీజ్ చేసిన తాజా టీజర్ ప్రకారం ఈ బైక్ డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అయితే ఇందులో ఏబీఎస్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఏబీఎస్ అంటే బ్రేకింగ్ విధులు రెండు చివర్లలో డిస్క్‌ల ద్వారా నిర్వహిస్తారు. అలాగే ముందు వైపున ఉన్న అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్‌తో వస్తుంది. అలాగే ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్క్స్ రైడర్స్‌ను అమితంగా ఆకర్షిస్తున్నాయి. యూఎస్‌డీ ఫోర్స్ మోటార్ సైకిల్‌కు మరింత కంపోజ్డ్, అధునాతన రైడ్ అందిస్తాయి. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400తో ట్రాక్షన్ కంట్రోల్‌ను కూడా అందిస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400 బాడీ ప్యానెల్ పై ఫాక్స్ కార్బన్ ఫినిషింగ్‌ను ఉపయోగించడం వల్ల యువతను అమితంగా ఆకర్షిస్తుంది. పల్సర్ ఎన్ఎస్ 400 హెడ్‌ల్యాంప్ ఎన్ఎస్ 200 లో కనిపించే విధంగానే ఉంటుంది. అయితే మోటార్ సైకిల్ మరింత దూకుడుగా ఉండేలా ఎలిమెంట్స్ కొన్ని మార్పులు ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన పల్సర్లలో చూసినట్టుగానే సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అందువల్ల డిస్‌ప్లేలో నోటిఫికేషన్లను, కాల్ మేనేజ్మెంట్‌ను కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొబైల్ పరికరాన్ని ఛార్జ్ చేయడానికి యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉంది. కొత్త క్లస్టర్ ఇంధన వినియోగం, సగటు ఇంధన ఆర్థిక వ్యవస్థతో పాటు గేర్ పొజిషన్‌పై నిజ-సమయ నవీకరణలను చూపుతుంది. ప్రస్తుతానికి రాబోయే ఎన్ఎస్ 400 కోసం బజాజ్ ఏ ఇంజన్ ఉపయోగిస్తుందో? పూర్తిగా ధ్రువీకరించలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..