మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు!
మందారం పువ్వు చూడటానికి అందంగా ఉండటంతోపాటు ఎన్నో ఔషధ గుణాలను కలిగివుంది. దైవరాధనలో ఉపయోగించడంతోపాటు మందారం నీటిని సేవించడం వల్ల మీ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అనేక వ్యాధులను అరికట్టడంలో ఎంతో సహాయపడుతుంది. అందుకే ప్రతీరోజూ ఉదయం మందారం నీరు తాగి ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.

మందారం పువ్వును ఎక్కువగా దైవరాధన కోసమే ఉపయోగిస్తుంటాం. చూడటానికి అందంగా ఉండే ఈ పుష్పం అనేక ప్రభావవంతమైన ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. దీన్ని ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేగాక, మంచి ఆరోగ్యం కోసం మందారం నీరు సేవించవచ్చు. మందారం నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు చర్మ రంగు మెరిచేలా చేస్తుంది. అంతేగాక, రుతు సమస్యలను కూడా తగ్గిస్తుంది. మందారం నీరు తాగడం వల్ల కలిగి అద్భుత ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి మందారం పువ్వులలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడుతుంది.
చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది మందారం నీరు తాగడం వల్ల శరీరం నుంచి విషపూరిత పదార్థాలను బయటకు పంపుతుంది. చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలు, చర్మ అలెర్జీలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మందారం నీరును సేవించడం వల్ల జుట్టు మూలాలకు పోషణ లభిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని అరికడుతుంది. వాటికి అవసరమైన సహజ మెరుపును ఇస్తుంది.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది మందారు నీరు మధుమేహ రోగులకు ప్రయోజనకారీగా ఉంటుంది. ఎందుకంటే, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
రుతు సమస్యలను తగ్గిస్తుంది మందారం నీరు మహిళల్లో క్రమరహిత లేదా బాధాకరమైన రుతు కాలాలను తగ్గించడంలో సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది.
అధిక బరువును తగ్గిస్తుంది మందారం నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచుతుంది. దీంతో బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
జీర్ణక్రియ మెరుగు మందారం నీరు గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజూ మందారం నీరు సేవించడం వల్ల మీ పొట్ట శుభ్రంగా తయారవుతుంది.
మందారం నీరును ఎలా తయారు చేయాలంటే?
రెండు నుంచి మూడు మందారం పువ్వులను తీసుకుని వాటిని కడగాలి. ఒక ప్యాన్‌లో రెండు కప్పుల నీరు గులాబీ లేదా ఎరుపు రంగులో మారే వరకు 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి తేనె లేదా నిమ్మరసంతో కలిపి తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని సేవిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మందారం నీరు సహజ టానిక్‌గా పనిచేస్తుంది. ఈ మందారం నీటిని క్రమం తప్పకుండా సేవించడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.