Actress : తోడు ఉంటాడనుకుంటే వాడుకుని వదిలేశాడు.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
బిగ్ బాస్ 6లో రచ్చ చేసి పాపులర్ అయ్యింది. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ రీల్స్, గ్లామర్ ఫోటోషూట్లతో నానా హంగామా చేసింది. అలాగే తన ప్రియుడిని సైతం నెటిజన్లకు పరిచయం చేసింది. ఇద్దరు కలిసి చేసిన రీల్స్, ఫోటోషూట్స్ పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ 6 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యింది ఇనయా సుల్తానా. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట మరింత యాక్టివ్ అయ్యింది. తన తీరు, గ్లామర్ ఆరబోతపై ఎన్ని విమర్శలు వచ్చినా..తగ్గేదేలే అన్నట్లుగా వరుస పోస్టులతో రచ్చ చేసింది. ముఖ్యంగా తన ప్రియుడితో కలిసి ఇనయా షేర్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇదెలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి పలు విషయాలు పంచుకుంది. ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నార్సిసిస్టిక్ ప్రవర్తన గల వ్యక్తులతో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందులను, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు కోసం చేసిన పోరాటాన్ని ఇనయా సుల్తానా పంచుకున్నారు. ప్రస్తుతం తాను 6-7 సినిమాల్లో నటిస్తున్నానని వెల్లడించారు.
బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ఎదుర్కొన్న మానసిక సవాళ్లను వెల్లడించారు. ఒక లవ్ ట్రాక్‌లో చిక్కుకుని తీవ్ర డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపారు. ఒంటరితనం, తనకంటూ ఎవరూ లేరన్న భావనతో మోసపోయినట్లు చెప్పారు. ఆ వ్యక్తి తన పేరును, డబ్బును ఉపయోగించుకుని వదిలేశాడని ఇనయా చెప్పుకొచ్చింది. ఆ బంధం ప్రేమ కాదని, మానిప్యులేషన్ అని తెలిపింది. వారి మధ్య కనెక్షన్ తన తండ్రి లేని లోటును పూడ్చేదిగా భావించానని, ఆయనకు కూడా తండ్రి లేకపోవడంతో “బహుశా అతను నన్ను అర్థం చేసుకుంటాడేమో” అని నమ్మానని వివరించారు. అయితే, ఆ వ్యక్తి తన ఫేమ్‌ను వాడుకున్నాడని ఆమె చెప్పారు. తాను తన జీవితాన్ని ఆ వ్యక్తితోనే ఊహించుకున్నానని, అందుకే అంతగా నమ్మానని తెలిపింది.
మానిప్యులేటివ్ సంబంధాలలో కనిపించే నార్సిసిస్టిక్ బిహేవియర్ గురించి ఇనయా సుల్తానా మాట్లాడుతూ.. ముందు లవ్ చూపించి, ఆ తర్వాత చిన్న ఇన్సిడెంట్లకు గొడవలు సృష్టించి, తప్పు తనదే అనిపించేలా చేయటం, మళ్ళీ లవ్ బాంబింగ్ చేయటం వంటి నార్సిసిస్టిక్ ప్రవర్తన అలాగే ఉంటుందని తెలిపింది. ఈ ప్రవర్తనతో అమ్మాయిలు ఎక్కువగా బాధితులు అవుతారని, నార్సిసిస్టిక్ అబ్బాయిలు ఎక్కువగా ఉండటం వల్లే పితృస్వామ్య సమాజం నడుస్తుందని ఆమె అన్నారు. మానసిక ఒత్తిడితో తనకు ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని..తన తప్పు కానప్పుడు ఎందుకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇనయా సుల్తానా అన్నారు. ప్రస్తుతం 6-7 సినిమాల్లో నటిస్తున్నానని, తిరిగి తన కెరీర్‌ను నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. తన ఫేమ్‌ను ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడని, అసూయతో వేధించేవాడని కూడా ఆమె వెల్లడించారు. ఇండస్ట్రీలో ప్రేమ పేరుతో వాడుకుని వదిలేసే బ్యాచ్ ఎక్కువ అని, ఒంటరితనం వల్ల తానూ మోసపోయానని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
