మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు.. ఫలితం చూస్తే అవాక్కే..
బీరు కేవలం తాగడానికే కాదు.. జుట్టు మెరవడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? మెరిసే జుట్టు కోసం బీరును ఎలా వాడాలి? అసలు బీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇప్పడు తెలుసుకుందాం..

సాధారణంగా బీరును ఒక ఆల్కహాలిక్ డ్రింక్‌గానే అందరూ చూస్తారు. కానీ ఇందులో ఉండే మాల్ట్, హాప్స్, బార్లీ వంటి సహజ సిద్ధమైన పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి, శరీరానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. బీరు వల్ల కలిగే లాభాలు, దానిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.
జుట్టు సంరక్షణలో బీర్ అద్భుతం!
బీరులో ఉండే ప్రోటీన్లు జుట్టుకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. బీర్‌లో ఉండే మాల్ట్, హాప్స్ జుట్టు తంతువులపై ఒక రక్షణ పొరను సృష్టించి, క్యూటికల్స్‌ను కాపాడతాయి. ఇందులోని ప్రోటీన్లు జుట్టును మందంగా మార్చడమే కాకుండా సహజమైన మెరుపును అందిస్తాయి. చిక్కులు పడకుండా జుట్టును మృదువుగా ఉంచుతాయి. హాప్స్‌లో ఉండే యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు నెత్తిని శుభ్రంగా ఉంచి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. బార్లీలోని జింక్, బి-విటమిన్లు జుట్టును దృఢపరుస్తాయి.
బీరుతో జుట్టును ఎలా కడగాలి?
జుట్టు కోసం బీరును నేరుగా వాడకుండా ఈ పద్ధతిని పాటించడం మంచిది..
గ్యాస్ తొలగించండి: ముందుగా ఒక బీరు బాటిల్ తెరిచి దానిలోని గ్యాస్ పోయేలా కొన్ని గంటల పాటు పక్కన పెట్టండి.
స్ప్రే చేయండి: గ్యాస్ పోయిన బీరును ఒక స్ప్రే బాటిల్‌లో పోసి, జుట్టు మొత్తం తడిచేలా స్ప్రే చేయండి.
మసాజ్: జుట్టు కుదుళ్లకు బీరు పట్టేలా 15 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అలాగే ఉంచండి.
శుభ్రం చేయండి: చివరగా చల్లటి నీటితో జుట్టును కడిగేయండి. బీర్ వాసన వస్తుందనిపిస్తే మంచి కండిషనర్‌ను ఉపయోగించవచ్చు.
మితంగా తీసుకుంటేనే..
పరిమితంగా బీరు తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఇందులో ఉండే సిలికాన్ అనే ఖనిజం ఎముకల సాంద్రతను పెంచి, వాటిని బలోపేతం చేస్తుంది. మూత్ర విసర్జనను పెంచే గుణం ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీరులో విటమిన్ బి కాంప్లెక్స్, పాస్పరస్, మెగ్నీషియం వంటి మూలకాలు జీవక్రియకు సహాయపడతాయి. ఏదైనా సరే తక్కువగా తీసుకుంటే ఆరోగ్యం.. ఎక్కువగా తీసుకుంటే ప్రమాదకరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




