Arijit Singh: పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా చేస్తున్న స్టార్ సింగర్ సంపాదన

Arijit Singh: పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా చేస్తున్న స్టార్ సింగర్ సంపాదన

Anil kumar poka

|

Updated on: Apr 26, 2024 | 1:54 PM

ప్రేమలో ముక్కలైన హృదయాలకు అతడి పాట ఓదార్పు.. అద్భుతమైన గాత్రం అతడికి దేవుడిచ్చిన వరం. ఎలాంటి సపోర్ట్ లేకుండానే రియాల్టీ షో ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతడు.. ఇప్పుడు ఇండియాలోనే టాప్ సింగర్‏గా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి సంగీత ప్రియులను మైమరపించాడు. అతడి లైవ్ ఈవెంట్ షోస్ కోసం లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు.

ప్రేమలో ముక్కలైన హృదయాలకు అతడి పాట ఓదార్పు.. అద్భుతమైన గాత్రం అతడికి దేవుడిచ్చిన వరం. ఎలాంటి సపోర్ట్ లేకుండానే రియాల్టీ షో ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతడు.. ఇప్పుడు ఇండియాలోనే టాప్ సింగర్‏గా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి సంగీత ప్రియులను మైమరపించాడు. అతడి లైవ్ ఈవెంట్ షోస్ కోసం లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. అతడి ఒక్క సంగీత కచేరి కోసం కోట్లలో ఖర్చు చేసేందుకు సైతం నిర్వాహకులు ముందుంటారు. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ టాప్ సింగర్ అర్జిత్ సింగ్. అయితే ఈ సింగర్ బర్త్‌ డే నేడు అంటే ఏప్రిల్ 25. దీంతో ఈ స్టార్ సింగర్ నేమ్ .. అండ్ వీడియోస్ మరో సారి నెట్టింట వైలర్ అవుతున్నాయి.

ఇక పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని జియాగంజ్‌లో 1987లో జన్మించాడు అర్జిత్. చిన్నప్పటి నుంచే సంగీతాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేశాడు. అతడి ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. 18 ఏళ్ల వయసులో 2005లో సింగింగ్ రియాల్టీ షో ఫేమ్ గురుకుల్‏లో పాల్గొన్నాడు. కానీ ఈ షోలో అతడు తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యాడు. 2010లో అర్జిత్ సింగ్ చేసిన తోసే నైనా మ్యూజిక్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో అర్జిత్ సింగ్ వాయిస్ మెస్మరైజ్ చేసింది. దీంతో హిందీలో నెమ్మదిగా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. 2011లో మర్డర్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆషికి 2 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!