Ahsaas Channa: అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..

Ahsaas Channa: అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..

Anil kumar poka

|

Updated on: Apr 26, 2024 | 1:59 PM

సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా చాలా మంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పెద్దయ్యాక హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అందులో కొందరు మాత్రమే తమకంటూ స్టార్ డమ్ అందుకుని ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు. అలాంటి ప్రతిభావంతులైన నటీనటులలో ఓ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. అబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా కుర్రాళ్ల గుండెలను దొచేసింది.

సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా చాలా మంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పెద్దయ్యాక హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అందులో కొందరు మాత్రమే తమకంటూ స్టార్ డమ్ అందుకుని ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు. అలాంటి ప్రతిభావంతులైన నటీనటులలో ఓ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. అబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా కుర్రాళ్ల గుండెలను దొచేసింది. ఇప్పుడు హీరోయిన్ గా సరైన అవకాశాలను అందుకుంటూ రాణిస్తోంది. ఆమె మరెవరో కాదు.. Ahsaas Channa. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన కభీ అల్విదా నా కెహనా సినిమాలో తో పాపులర్ అయింది అహ్సాస్‌. కానీ ఇందులో షారుఖ్ ఖాన్, ప్రీతి జింటాల కొడుకుగా.. చిన్న అబ్బాయిగా కనిపించింది.

తన యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకోవడమే కాదు.. అబ్బాయిగానే తనను అందరూ అనుకునేలా చేసింది. అంతకు ముందు కూడా.. అబ్బాయిగానే నటిచింది. కానీ ఇప్పుడు హీరోయిన్‌గా.. సిల్వర్ స్క్రీన్‌ పై మళ్లీ అడుగుపెట్టడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక అహ్సాస్ చన్నా ఆగష్టు 5, 1999న ముంబైలోని పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఇక్బాల్ సింగ్ చన్నా పంజాబీ సినిమా నిర్మాత, తల్లి కుల్బీర్ బడేస్రాన్ నటి. ‘వీర్-జారా’, ‘కేసరి’, ‘మంటో’, ‘సీఐడీ’, ‘క్రైమ్ పెట్రోల్’ వంటి సినిమాల్లో నటించింది. అలాగే టీవీ, వెబ్ షోలలో కనిపించింది. అహ్సాస్ ఐదేళ్ల వయసులో నటించడం ప్రారంభించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ లీడ్‌ రోల్స్ చేస్తూ చాలా బిజీగా ఉంటోంది. ఇన్ స్టాలో అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా పనిచేస్తుంది. ఇప్పటివరకు నికర విలువ 10 కోట్లు సమాచారం. ప్రస్తుతం అహ్సాస్ వయసు 24 ఏళ్లు మాత్రమే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!