Tamannaah Bhatia: IPL మ్యాచ్‌ల కారణంగా పోలీస్ కేసులో తమన్నా.!
తమన్నా చిక్కుల్లో పడింది. ఫెయిర్ ప్లే యాప్ బ్రాండ్ అంబాసిడర్ అయిన కారణంగా.. పోలీసులు నుంచి నోటీసులు అందుకుంది. తనకు ప్రమేయం లేకుండానే కోర్టు మెట్లెక్కే పరిస్థితి వచ్చింది ఈ బ్యూటీకి. ఇక అసలు విషయం ఏంటంటే..! టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోయిన సీజన్ అంటే ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగానూ..
తమన్నా చిక్కుల్లో పడింది. ఫెయిర్ ప్లే యాప్ బ్రాండ్ అంబాసిడర్ అయిన కారణంగా.. పోలీసులు నుంచి నోటీసులు అందుకుంది. తనకు ప్రమేయం లేకుండానే కోర్టు మెట్లెక్కే పరిస్థితి వచ్చింది ఈ బ్యూటీకి. ఇక అసలు విషయం ఏంటంటే..! టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోయిన సీజన్ అంటే ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగానూ ఈనెల 29న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తమన్న చేసిన పనికి తమకు కోట్లలో నష్టం వాటిల్లిందంటూ ప్రసార హక్కులు కలిగిన అంబానీస్.. వయాకమ్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నాకు నోటీసులు అందించారు. ఇక ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకుంది. ఈ సంస్థ ఫిర్యాదుతో మహారాష్ట్ర సైబల్ సెల్ ఫెయిర్ ప్లే యాప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేసేందుకే తమన్నా విచారణకు రావాలంటూ ఆమెకు సమన్లు పంపారు పోలీసులు. ఫెయిర్ ప్లే యాప్ ను ప్రమోట్ చేసిందని.. అందుకే సాక్షిగా విచారణకు పిలిచారని వర్గాలు తెలిపాయి. అయితే ఈ కేసులో తమన్నా ఒక్కరే కాదు.. ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!