Husband Temple: పతియే ప్రత్యక్ష దైవం.! భర్తకు గుడి కట్టిన మహిళా..
పతియే ప్రత్యక్ష దైవం అన్న మాటను ఆమె నిజం చేసింది. మృతి చెందిన భర్త రూపం కళ్లముందే కదలాడుతుండటంతో దానిని శాశ్వతం చేసుకోవాలని భావించిన ఆమె భర్తకు గుడికట్టి తన కల నెరవేర్చుకుంది. మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన కల్యాణి-బానోతు హరిబాబుకు 27 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేకున్నా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించారు.
పతియే ప్రత్యక్ష దైవం అన్న మాటను ఆమె నిజం చేసింది. మృతి చెందిన భర్త రూపం కళ్లముందే కదలాడుతుండటంతో దానిని శాశ్వతం చేసుకోవాలని భావించిన ఆమె భర్తకు గుడికట్టి తన కల నెరవేర్చుకుంది. మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన కల్యాణి-బానోతు హరిబాబుకు 27 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేకున్నా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించారు. హరిబాబు మూడేళ్ల క్రితం కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఒంటరి అయిన ఆమె మానసికంగా కుంగిపోయారు. భర్తను తలచుకుని ఎంతగానో రోదించారు. ప్రతిక్షణం భర్త రూపం కళ్లముందు కదలాడుతుండటంతో ఆమె ఆ కలల రూపాన్ని కళ్లముందే ఉంచుకోవాలనుకున్నారు. తన భర్తకు గుడి కట్టాలని, అందులో తన దైవాన్ని ప్రతిష్టించుకోవాలని భావించారు.
ఆమె కల బుధవారం నెరవేరింది. దాదాపు రూ. 20 లక్షలు ఖర్చుచేసి భర్తకు గుడికట్టించారు. రాజస్థాన్‌లో తన భర్త విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేయించారు. బుధవారం గుడిలో భర్త నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బంధువులతో కలిసి పూజలు చేశారు. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తండావాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భర్తపై తనకున్న ప్రేమకు స్థానికులు సైతం ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.