Orange Sky: నారింజ రంగులోకి మారిన ఆకాశం.. కారణం ఇదే.! వీడియో.

Orange Sky: నారింజ రంగులోకి మారిన ఆకాశం.. కారణం ఇదే.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Apr 26, 2024 | 2:22 PM

పైన ఏదో మర్దర్ జరిగినట్లు లేదు ఆకాశంలో.. ” అంటూ ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాల్ రావు చెప్పే డైలాగ్ గుర్తుందా? ఎర్రగా కనిపించే ఆకాశం గురించి ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ ఫేమస్ అయ్యింది. యూరోపియన్ దేశమైన గ్రీస్ లోనూ కాస్త అటుఇటుగా అదే తరహా దృశ్యం ఆవిష్కృతమైంది! ఆకాశం ఒక్కసారిగా నారింజ రంగులోకి మారిపోవడం స్థానికులతోపాటు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

పైన ఏదో మర్దర్ జరిగినట్లు లేదు ఆకాశంలో.. ” అంటూ ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాల్ రావు చెప్పే డైలాగ్ గుర్తుందా? ఎర్రగా కనిపించే ఆకాశం గురించి ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ ఫేమస్ అయ్యింది. యూరోపియన్ దేశమైన గ్రీస్ లోనూ కాస్త అటుఇటుగా అదే తరహా దృశ్యం ఆవిష్కృతమైంది! ఆకాశం ఒక్కసారిగా నారింజ రంగులోకి మారిపోవడం స్థానికులతోపాటు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజధాని ఏథెన్స్ సహా ఇతర నగరాలవ్యాప్తంగా ఇదే సీన్ కనిపించింది. దీంతో టూరిస్టులు ఈ అద్భుత దృశ్యాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేశరు. దీన్ని చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతోంది? ఆకాశం పూర్తిగా నారింజ రంగులోకి మారిపోవడం నేనెప్పుడూ చూడలేదు. సూర్యుడు ఎటు పోయాడు అంటూ ఒకరు, ఇది యుగాంతానికి హింట్‌ కాదు కదా అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.

ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వీచిన బలమైన గాలులు ఇసుక రేణువులతో కూడిన దుమ్మును ఇలా గ్రీస్ మొత్తాన్ని ఇసుక తుపాను రూపంలో కమ్మేశాయి. దీనివల్ల ఆకాశమంతా నారింజ రంగులోకి మారిపోయింది. అయితే ఈ పరిణామం అక్కడి గాలి నాణ్యతను దెబ్బతీసింది. పసుపు–నారింజ రంగులోని సన్నని దుమ్ము వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టపగలే ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల శ్వాసకోస సమస్యలు కూడా వస్తాయని అధికారులు హెచ్చరించారు.

ఇక ఇసుక తుపాను వల్ల ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగిపోయాయట. 2018 తర్వాత ఇంత దారుణంగా పరిస్థితి మారడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద దీవి అయిన, దక్షిణ ప్రాంతంలో ఉన్న క్రీట్ లో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు చేరుకుంది. ఉత్తర గ్రీస్ తో పోలిస్తే ఇది సాధారణంకన్నా ఏకంగా 20 డిగ్రీలకు పైగా ఎక్కువ. ఈ తీవ్ర గాలులకు దేశంలోని దక్షిణ ప్రాంతంలో కార్చిచ్చులు వ్యాపించాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 25 కార్చిచ్చులు ఏర్పడ్డట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే రోజుల వ్యవధిలోనే తూర్పు మధ్యదరా ప్రాంతంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. స్వచ్ఛమైన, తాజా గాలి వీస్తుందని.. ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!