పృధ్వీ రాజ్ కెఎన్ ఎవరు? హనుమ విహారినితో అసలు గొడవేంటి?
27 Febraury 2024
ఆంధ్రప్రదేశ్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై హనుమ విహారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఆంధ్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనంటూ ప్రకటించాడు.
తనను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు జట్టులో ఆటగాడిగా ఉన్న ఒక రాజకీయ నాయకుడు కుమారుడే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
ఈ నేపథ్యంలో పృధ్వి రాజ్ కెఎన్ చర్చల్లోకి వచ్చాడు. పృధ్వీ రాజ్ ఇదే విషయంపై రాజకీయ నేతైన తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో విహారిపై చర్య తీసుకోవాలని ACAని కోరాడు.
పృధ్వీ రాజ్ హనుమ విహారి వాదనలను 'పూర్తిగా అబద్ధం' అని ఖండించాడు. ప్రముఖ ఆంధ్రా క్రికెటర్ తనపై వ్యక్తిగత దాడికి పాల్పడ్డాడంటూ చెప్పుకొచ్చాడు.
పృద్వీ రాజ్ 2023లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రా తరపున దేశీయ అరంగేట్రం చేశాడు.
సీనియర్ జట్టులోకి రాకముందు పృధ్వీ కూచ్ బెహార్ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.
యువ ఆంధ్ర క్రికెటర్ రంజీ ట్రోఫీ 2023-24 కోసం తన రాష్ట్ర జట్టులో చేర్చబడ్డాడు. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో పృధ్వీ రాయలసీమ కింగ్స్‌తో ఆడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన తన ఏకైక లిస్ట్ A మ్యాచ్‌లో, పృద్వీ రాజ్ కేఎన్ 35 పరుగులు చేశాడు.