AP News: బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..

ఎప్పుడు గంభీరంగా కనిపించే మంత్రి బొత్స సడన్‎గా చిన్నపిల్లాడిలా మారిపోయారు. భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అది కూడా నాలుగు గోడల మధ్య కాదు.. వేలాది మంది ప్రజలు చూస్తున్న సమయంలోనే తన కంటి నుంచి నీరు కార్చారు. ఆయన కళ్ల నుండి వచ్చిన కన్నీరును చూసిన కార్యకర్తలు సైతం తమ అభిమానాన్ని ఆపుకోలేక కంటతడిపెట్టుకున్నారు.

AP News: బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
Botsa Satyanarayana
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 26, 2024 | 6:11 PM

ఎప్పుడు గంభీరంగా కనిపించే మంత్రి బొత్స సడన్‎గా చిన్నపిల్లాడిలా మారిపోయారు. భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అది కూడా నాలుగు గోడల మధ్య కాదు.. వేలాది మంది ప్రజలు చూస్తున్న సమయంలోనే తన కంటి నుంచి నీరు కార్చారు. ఆయన కళ్ల నుండి వచ్చిన కన్నీరును చూసిన కార్యకర్తలు సైతం తమ అభిమానాన్ని ఆపుకోలేక కంటతడిపెట్టుకున్నారు. అందుకు ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికైంది. అదే ఇప్పుడు నెట్టింట వైరల్‎గా మారింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో చెల్లూరు వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు. దానికి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. అయితే జగన్ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత అభ్యర్థులను పరిచయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా చీపురుపల్లి నుండి బొత్స సత్యనారాయణ అని జగన్ బొత్స పేరు ఉచ్చరించగానే వేలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా తమ కరతాళ ధ్వనులతో, హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఒక్కసారిగా సభా ప్రాంగణం అంతా దద్దరిల్లింది. అలా అభిమానుల నుండి వచ్చిన ఆ శబ్దాలు విన్న బొత్స తన పట్ల వేలాది మంది కార్యకర్తలు చూపించిన అభిమానాన్ని తట్టుకోలేని బొత్స ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు.

ఇంతలో జగన్ బొత్స గురించి చెప్తూ బొత్స సత్యనారాయణ నాకు తండ్రి సమానులు అని అనడంతో మరింత భావోద్వేగానికి లోనయ్యారు. బొత్స తన కళ్ల నుండి వచ్చిన కన్నీరు ఆపుకోలేకపోయారు. దీంతో సభలో ఉన్న వారితో పాటు లక్షలాదిగా టివీలు, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని గురయ్యారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా తన మొండివైఖరి, వాగ్ధాటితో అవలీలగా ఎదుర్కొన్న బొత్స ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. డిసిసిబి బ్యాంక్ చైర్మన్‎గా, ఎంపిగా, ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన స్ట్రాంగ్ పర్సనాలిటీ బొత్స కళ్ల వెంట కన్నీరు ఎందుకు వచ్చింది అని మరికొందరు అడుగుతున్నారు. అయితే బొత్స తన రాజకీయ జీవితంలో ఏ ఒక్క పదవి అంత సులువుగా రాలేదనే చెప్పాలి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ తన రాజకీయ చాణక్యంతో సాధించుకున్న పదవులే ఎక్కువ. ఈ క్రమంలోనే వోక్స్ వ్యాగన్‎తో పాటు అనేక ఆరోపణలు, అనేక దర్యాప్తులు ఎదుర్కొన్నారు. అలాంటి ఎన్ని సమస్యలు ఎదురైనా ఏ రోజు చలించకుండా గుండెల నిండా ధైర్యంతో ముందుకు సాగారు. బొత్స ప్రస్తుతం వైసిపి ప్రభుత్వంలో కూడా కీలక నేతగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రత్యర్థులను తన వాగ్దాటితో, రాజకీయ చతురతతో ముచ్చెమటలు పట్టించే బొత్స, ఎప్పుడు గంభీరంగా వ్యవహరించే నాయకుడు ఇలా భావోద్వేగానికి లోనవ్వడం ఏంటి? ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు? బొత్స పట్ల అభిమానులు చూపిన అభిమానం తట్టుకోలేకే ఎమోషన్ అయ్యారా? లేక వేరే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక మాత్రమే భావోద్వేగానికి లోనయ్యారని అంటున్నారు ఆయన అభిమానులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!