Andhra Pradesh: ఈ మహిళా నేతల వద్ద కేజీల్లో బంగారం.. ఇవిగో లెక్కలు
లచ్చిందేవికి ఓ లెక్కుంది..! అవును, ఆంధ్రప్రదేశ్‌లో మహిళా అభ్యర్థుల దగ్గర ఉన్న పసిడి లెక్కలు తేలాయి. నామినేషన్ దాఖలులో భాగంగా అఫిడవిట్‌లో వారి ఇచ్చిన పసిడి లెక్కలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మహిళా అభ్యర్థుల కంటే పురుషుల దగ్గరే అధిక బంగారం ఉందంటే లచ్చిందేవి లెక్క ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు..

YS Sharmila - Madhavi Reddy - Butta Renuka
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయింది.ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల దగ్గర ఎంత బంగారం ఉందన్నది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. కొందరు అభ్యర్థుల దగ్గర కేజీల కొద్దీ బంగారం ఉండగా మరికొందరు గ్రాములకే పరిమితమయ్యారు. YCP, కూటమి అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర ఎంత బంగారం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం
- కడప టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి దగ్గర 6.5 కేజీల బంగారం ఉంది. డైమండ్ ఆర్నమెట్స్ కూడా అఫిడవిట్‌లో బాగానే చూపించారు.
- మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విషయానికి వద్దాం. పెనుకొండ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఉషశ్రీ దగ్గర 6.6 కేజీల బంగారం ఉంది.
- ఇక విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దగ్గరకు వస్తే మూడున్నర కిలోలు పసిడి ఉంది. 19 కోట్ల వరకూ కుటుంబ ఆస్తులు ఉన్నాయి.. పడిసి మూడున్నర కిలోలుగా చూపించారు.
- అటు కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల దగ్గర మూడున్నర కోట్ల బంగారం ఉంది. అంటే.. 6 కేజీలకు పైగా బంగారు నగలున్నాయన్నారు.. వీటితోపాటు 4 కోట్ల 61 లక్షల విలువ చేసే వజ్రాల ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు.
- ఇక ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు బుట్టా రేణుక. ఆమె దగ్గర 2.3 కేజీల బంగారం ఉంది. అఫిడవిట్ ప్రకారం రేణుక ఆస్తులు 161 కోట్లు.. ఐతే.. బంగారం మాత్రం 2.3 కేజీలు ఉంది.
- టెక్కలి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తన దగ్గర సుమారు 2.5 కేజీల బంగారం ఉంది.
- అరకు లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత దగ్గర రెండుకిలోల పసిడి ఉన్నట్లు తెలుస్తోంది.
- నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉమాబాల దగ్గర రెండు కిలోల బంగారం ఉంది.
ఐతే మహిళా అభ్యర్థులను మించి బంగారం ఉన్న పురుష అభ్యర్థులు కొందరున్నారు. వారిలో మొదటి స్థానంలో ఉన్నది అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్.
- అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేశ్ దగ్గర మొత్తం 13 కిలోల బంగారం ఉంది.
- టెక్కలిలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై పోటీ చేస్తున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నాలుగున్నర కిలోలు పసిడి ఉంది.
- విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజానా చౌదరి దంపంతుల దగ్గర 11 కిలోలు బంగారం ఉండగా.. దీని విలువ రూ. 10 కోట్లు పైనే.
- గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు వద్ద ఉన్నది 138 గ్రాముల బంగారమే అయినా ఆయన భార్య పేరిట 5 కేజీల 687 గ్రాముల బంగారం ఉంది.
- ఇక హిందూపురం టీడీపీ అభ్యర్థి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భార్య దగ్గర మూడున్నర కిలోల బంగారం ఉంది.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
