AP Election 2024: సార్వత్రిక ఎన్నికల బరిలో సామాన్యులు.. వారి ఆస్తులు ఎంతో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌లో పేదలు సామాన్యులు తమ అదృష్టాన్ని ఎన్నికల్లో పరీక్షించు కోబోతున్నారు.కోట్లకు అధిపతులు ఎన్నికల బరిలో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో దిగుతున్న వేళ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్లు వారి పరిస్థితులు చూస్తే వీళ్ళ అసెంబ్లీ బరిలో నిలిచిన వారెనా అని ఆశ్చర్యపోకతప్పదు..!

AP Election 2024: సార్వత్రిక ఎన్నికల బరిలో సామాన్యులు.. వారి ఆస్తులు ఎంతో తెలుసా..?
Ap Election
Follow us

|

Updated on: Apr 26, 2024 | 2:15 PM

ఎన్నికలంటే కోటీశ్వరులు ఆపర కుబేరులకు మాత్రమే సాధ్యమని భావిస్తున్న ఈరోజుల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో పేదలు సామాన్యులు తమ అదృష్టాన్ని ఎన్నికల్లో పరీక్షించు కోబోతున్నారు.కోట్లకు అధిపతులు ఎన్నికల బరిలో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో దిగుతున్న వేళ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్లు వారి పరిస్థితులు చూస్తే వీళ్ళ అసెంబ్లీ బరిలో నిలిచిన వారెనా అని ఆశ్చర్యపోకతప్పదు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లు ఆస్తుల లెక్కలు చూస్తే కళ్ళు చెదరాల్సిందే! కోట్లకు అధిపతులు అసెంబ్లి పార్లమెంట్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ జనసేన తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్లలో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తమ తమ నామినేషన్లలో అఫిడవిట్లు సమర్పించారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్లు చూస్తే కళ్లు చెదిరే స్థిరాస్తులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు సమర్పించడంతో పాటు ఒక్కో అభ్యర్ధి తమకు రూ. 50 కోట్ల నుంచి స్థిర చర ఆస్తులు మొత్తం కలిపి రూ. 8 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సంధర్భంగా అఫిడవిట్లను సమర్పించడంతో ఇప్పుడు ఎపీ రాజకీయాల్లో నేతల ఆస్తుల వివరాలపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.

కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల బరిలో చాలామంది అభ్యర్థులు నిలిచిన వేళ కేవలం త ఖాతాలో మూడు అంకెల బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేని అభ్యర్థులు వైసీపీ తరఫున ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారిలో ముందు వరుసలో ఉన్నారు. మైలవరం నియోజక వర్గం నుంచి అతి సాధారణమైన వ్యక్తిగా ఉన్న సార్ణాల తిరుపతిరావు. ప్రస్తుతం మైలవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరుపతిరావు మొత్తం ఆస్తి 4,20,766 రూపాయలు మాత్రమే ఉన్నట్లుగా తన ఆపిడవిట్లో పేర్కొన్నారు. ఇక చరాస్తులకు సంబంధించి రూ.1,89,642 మాత్రమే ఉన్నాయని, ఇక బ్యాంక్ అకౌంట్ లో తొమ్మిది వేల రూపాయలతో పాటు ఒక బైక్ మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్ సమర్పించారు. మొత్తంగా తనకు సంబంధించి బంగారం రూ. 1,65,000, చేతిలో నగదు రూ.15,000 ఉన్నట్లుగా పేర్కొనడం విశేషం. ఈ ఎన్నికల్లో అతి సామాన్యుడిగా సార్నాల తిరుపతిరావు బరిలోకి దిగడం, పైగా అపర కుబేరుడుగా ఉన్న మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌పై పోటీ చేస్తూ ఉండటంతో ప్రస్తుతం అందరి దృష్టి మైలవరంపై పడింది.

ఇక సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈర్లకప్పకు సొంత బైకు తప్ప ఎటువంటి స్థిర చర ఆస్తులు లేకపోవడం విశేషం. కేవలం 2,783 రూపాయలు మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్ సమర్పించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ప్రగతి గ్రామీణ బ్యాంకులో 11 రూపాయలు కెనరా బ్యాంకులో 41 రూపాయి ఏడీసీసీ బ్యాంకులో రూ. 26,950 రూపాయలు యూనియన్ బ్యాంకులో రూ. 881తో పాటు అప్పులు రూ.1,13,050 ఉన్నట్లు తెలిపారు. ఇందులో బ్యాంకు రుణం రూ. 86,100 కాగా, ఇతర అప్పులు రూ. 26,950 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా స్థిర చర ఆస్తులు కలిపి రూ. 99,883 మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు ఈర్లక్కప్ప. ప్రస్తుతం మడకశిర నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎమ్మెస్ రాజు పోటీ చేస్తున్నారు.

మరోవైపు అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎం వీరాంజనేయులు కూడా అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన అసెంబ్లీ నుంచి బరిలో దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన సమర్పించిన అఫిడవీట్ ప్రకారం స్థిరాచరాస్తులకు సంబంధించి కేవలం 1,06,478 రూపాయలు మాత్రమే ఉన్నాయి. చేతిలో 50 వేల రూపాయలతో పాటు ఎస్‌బీఐలో 11,193 రూపాయలు, అలాగే ద్విచక్ర వాహనం మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న ఆయనను ఈ సార్వత్రిక ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగిపోతున్నారు.

ఇక పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అతి సామాన్యుడు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నారు. పాడేరు అసెంబ్లీ నుంచి ఎం విశ్వేశ్వర రాజు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిలో 20,39,512 రూపాయలు మాత్రమే ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల పేరు మీద రూ. 7,25,927 అప్పులు రూ.1,20,000 స్థిరాచరాస్తులు కలిపి రూ. 50,98,000 మాత్రమే ఉన్నట్లు ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ఢిల్లీ పోలీసుల కేసుపై హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదే 
ఢిల్లీ పోలీసుల కేసుపై హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదే 
ఏపీలో పొలిటికల్‌ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్‌?
ఏపీలో పొలిటికల్‌ బీపీ పెరుగుతోందా? మోదీ సభలపై వైసీపీ రియాక్షన్‌?
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల్ని అస్సలు కొనకండి..
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల్ని అస్సలు కొనకండి..
వాటే న్యూస్... ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..
వాటే న్యూస్... ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..
నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు
నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు
మీ ఐ పవర్ ఏ రేంజిదంటే? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపులెహె!
మీ ఐ పవర్ ఏ రేంజిదంటే? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపులెహె!
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..