వడ్డీకాసుల వాడికి మళ్ళీ భారీ ఆదాయం.. ఏప్రిల్ లో కూడా రికార్డ్ బ్రేక్ 

 03 May 2024

TV9 Telugu

Pic credit - TTD

తిరుమల శ్రీవారి ఆదాయం మరోసారి 100 కోట్లు దాటింది. ఏప్రిల్ నెలలో కూడా భారీ సంఖ్యలో స్వామివారికి భక్తులు కానుకల్ని సమర్పించారు.

శ్రీవారి భక్తులు

కరోనా తర్వాత శ్రీవారి ఆదాయం వంద కోట్లను దాటుతోంది. 2022 మార్చి నెల నుంచి నేటి వరకూ ప్రతి నెలా శ్రీవారి ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతోంది. 

వంద కోట్ల మార్క్ 

అయితే శ్రీవారి ఆదాయం గత నెలతో పోలిస్తే కొంత మేర తగ్గింది. మార్చి నెలలో రూ.118 కోట్ల ఆదాయం రాగా ఏప్రిల్ నెలలో రూ.101 కోట్లు వచ్చింది

మార్చి-ఏప్రిల్ ఆదాయాలు  

విద్యార్ధుల పరీక్షలు కంప్లేట్ అయి వేసవి సెలవులు వచ్చేశాయి.. దీంతో ఏప్రిల్‌ నెలలో తిరుమల శ్రీవారిని 20.17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 

భక్తుల సంఖ్య 

ఏప్రిల్‌ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి రూ 101.63 కోట్ల కానుకలను భక్తులకు సమర్పించారు. 

హుండీ కానుకలు

తిరుమల శ్రీవారి లడ్డుకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. భక్తులు స్వామివారి ప్రసాదం లడ్డులను కొనుగోలు చేశారు. ఏప్రిల్‌ నెలలో 94.22 లక్షల లడ్డూలు విక్రయించారు. 

లడ్డూల విక్రయం 

స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఏప్రిల్ నెలలో 39.73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.  

అన్నప్రసాదం 

శ్రీవారికి భక్తులు మొక్కుకుని తమ తలనీలాలు సమర్పిస్తారు. ఏప్రిల్ నెలలో 8.08 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 

తలనీలాలు

వేసవి సెలవులతో తిరుమలలో భారీగా రద్దీ నెలకొంటుంది. వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు చలువుపందిళ్లు, కూల్ పెయింటింగ్ వంటి సౌకర్యాలు కల్పించారు

వేసవి తాపం నుండి ఉపశమనం