Egg Explosion: బాంబుల్లా పేలుతున్న ఉడకబెట్టిన గుడ్లు.. కారణం ఇదే!

రోజు వారీ ఆహారంలో గుడ్డు ముఖ్యమైనది. ఇందులో సమృద్ధిగా ప్రోటీన్ ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టి లేదంటే ఆమ్లెట్, గుడ్డు కూర, భుర్జీ, పరాఠాగా ఇలా అభిరుచిని బట్టి తింటుంటారు. పోషకాహారం పొందడానికి గుడ్డు చౌకైన మార్గం. కానీ ఒక్కోసారి గుడ్లు బాంబుల్లా పేలుతాయ్‌.. అంత చిన్న గుడ్డు బాంబులా ఎలా పేలుతుంది? అనే సందేహాలు మీకూ ఉంటే ఇక్కడ తెలుసుకుందాం.. సాధారణంగా ఉడికించిన గుడ్డుపై పగుళ్లు ఏర్పడతాయి. అయితే మైక్రోవేవ్‌లో ఉడకబెట్టిన గుడ్లు మాత్రం..

Egg Explosion: బాంబుల్లా పేలుతున్న ఉడకబెట్టిన గుడ్లు.. కారణం ఇదే!
Egg Explosion
Follow us

|

Updated on: May 06, 2024 | 7:10 PM

రోజు వారీ ఆహారంలో గుడ్డు ముఖ్యమైనది. ఇందులో సమృద్ధిగా ప్రోటీన్ ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టి లేదంటే ఆమ్లెట్, గుడ్డు కూర, భుర్జీ, పరాఠాగా ఇలా అభిరుచిని బట్టి తింటుంటారు. పోషకాహారం పొందడానికి గుడ్డు చౌకైన మార్గం. కానీ ఒక్కోసారి గుడ్లు బాంబుల్లా పేలుతాయ్‌.. అంత చిన్న గుడ్డు బాంబులా ఎలా పేలుతుంది? అనే సందేహాలు మీకూ ఉంటే ఇక్కడ తెలుసుకుందాం.. సాధారణంగా ఉడికించిన గుడ్డుపై పగుళ్లు ఏర్పడతాయి. అయితే మైక్రోవేవ్‌లో ఉడకబెట్టిన గుడ్లు మాత్రం పేలిపోతుంటాయి. నిజానికి.. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. దీని వెనుక ఉన్న సైన్స్‌ గుట్టు ఉందంటున్నారు నిపుణులు. గుడ్డు బాంబులా పేలడం వెనుక ఉన్న సైన్స్‌ తెలుసుకునే ముందు అమెరికాలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుందా.. అమెరికాలో ఓ వ్యక్తి రెస్టారెంట్‌కి వెళ్లి గుడ్డు ఆర్డర్‌ చేశాడు. వెయిటర్‌ మైక్రోవేవ్‌లో ఉడికించిన గుడ్డును పెట్టి, వేడి చేసి తీసుకొచ్చాడు. సదరు కస్టమర్ గుడ్డును నోట్లోపెట్టుకోగానే వెంటనే అది బాంబులా పేలిపోయింది. దీంతో అతడికి తీవ్రమైన కాలిన గాయాలు అయ్యాయి. అనంతరం సదరు రెస్టారెంట్‌పై బాదితుడు దావా వేశాడు. కాలిన గాయాలు మాత్రమే కాకుండా, గుడ్డు పగిలిన శబ్దం ధాటికి అతడు శాశ్వతంగా చెవిటివాడిగా మారిపోయాడు.

గుడ్లు పగిలిన శబ్దం వినికిడిని దెబ్బతీసేంత బిగ్గరగా ఉంటుందా అనే దానిపై శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. శాస్త్రవేత్తలు మొదట్లో మైక్రోవేవ్‌లో గుడ్లు పగులగొట్టే యూట్యూబ్ వీడియోలను సమీక్షించారు. కానీ ఈ వీడియోలు శాస్త్రీయ పరిశోధన ఆధారంగా లేవు. వాటిని కేవలం వినోదం కోసం మాత్రమే చిత్రీకరించారు. దీంతో వారు స్వయంగా ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా సుమారు 100 ఉడికించిన గుడ్లను మళ్లీ వేడి చేశారు. మొదట గుడ్లు నీటిలో ఉంచి, ఆ తర్వాత మూడు నిమిషాలు మైక్రోవేవ్ వేడిచేశారు. అనంతరం ఒక గుడ్డు తీసి నేలపై పెట్టి రంధ్రం చేవారు. అంతే అది బాంబులా పేలింది. ఇలా మైక్రోవేవ్‌లో మళ్లీ వేడిచేసిన గుడ్లు పేలిపోతున్నట్లు గుర్తించారు. పేలిన గుడ్ల గరిష్ట ధ్వని ఒత్తిడి స్థాయి 12 అంగుళాల దూరంలో 86 నుండి 133 డెసిబుల్స్ వరకు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

అసలెందుకు గుడ్డు పేలిపోతుంది?

మైక్రోవేవ్‌లో గుడ్డును దాని పై తొక్కను తొలగించకుండా ఉంచినట్లయితే, పై తొక్క కింద ఆవిరి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో గుడ్డు పగిలిపోతుంది. ఈ పేలుడు గ్రెనేడ్ పేలడం లాంటిదే. గుడ్డులోని తెల్లసొన, పెంకు మధ్య ఒక పొర ఉంటుంది. అది ఒత్తిడిని పెంచడానికి అనుమతిస్తుంది. కానీ గుడ్డును కాలితో తొక్కినప్పుడు, ఒలిచినప్పుడు ఇది జారిపోతుంది. చుట్టుపక్కల ఉన్న నీటి కంటే గుడ్డు పచ్చసొన చాలా వేగంగా వేడెక్కుతుందని పరిశోధకులు ఈ ప్రయోగంలో కనుగొన్నారు.

సాధారణ గాలి పీడనం వద్ద ఆ పొర విస్తరించడానికి, ఆవిరిగా మారడానికి గదిని కలిగి ఉంటాయి. కానీ గుడ్డు లోపల ఉన్న చుట్టుపక్కల ఒత్తిడి, హార్డ్ ప్రోటీన్లు, ఉష్ణోగ్రత పెరిగినప్పటికీ పాకెట్స్ ద్రవంగా ఉండటానికి ఫోర్స్‌ చేస్తాయి. కానీ ఆ పాకెట్లలో ఒకటి చెదిరిపోతే, అది విస్తరిస్తుంది. శూన్యతను పూరించడానికి నీటి అణువులు పరుగెత్తుతాయి. ఇది విస్తరణకు కారణమవుతుంది. ఫలితంగా చుట్టుపక్కల కణజాలంపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఒక్కడైనా ఒత్తిడి పెరిగితే, మొత్తం గుడ్డు ముక్కలుగా పేలిపోతుంది. ఇలా పేలినప్పుడు దాని ముక్కలు చాలా దూరం వ్యాపిస్తాయి.

మైక్రోవేవ్‌లో అధిక-ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్‌లు కరెంట్‌ నుంచి ఉత్పత్తి అవుతాయి. ఈ మైక్రోవేవ్‌ల కారణంగా నీటి అణువులు చాలా వేగంగా కంపించడం ప్రారంభిస్తాయి. ఇది నీటి అణువులు ఒకదానితో ఒకటి ఢీకొనే ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. అందువల్ల గుడ్డును ఉడకబెట్టి, ఒలిచి, ఆపై చల్లార్చి మైక్రోవేవ్‌లో ఉంచినప్పుడు, గుడ్డు లోపల తేమ చాలా వేడిగా మారుతుంది. దీని వల్ల కోడిగుడ్డు పచ్చసొన చాలా బిగుతుగా మారుతుంది. గుడ్డును బయటకు తీసి కత్తితో కోస్తే అది బాంబులా పేలుతుంది. కొంతమందికి ఇది గుడ్డు పగిలిపోయినట్లు అనిపించవచ్చు. కానీ ఈ దృగ్విషయం అధిక వేడిపై ఉడకబెట్టడం ద్వారా సంభవిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..