Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల్ని అస్సలు కొనకండి..

అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రోజు బంగారం, వెండి వస్తువులు కొంటే మంచిదని, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని అందరూ నమ్ముతారు. దీంతో చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొంటూ ఉంటారు. అదే విధంగా శుభ కార్యక్రమాలు కూడా మొదలు పెడుతూ ఉంటారు. బంగారం, వెండి వస్తువులతో పాటు ఇతర వస్తువులు కూడా చాలా మంది కొంటూ ఉంటారు. పలు రకాల వస్తువులు ఈ రోజు కొనుగోలు చేయడం వల్ల..

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల్ని అస్సలు కొనకండి..
Akshaya Tritiya 2024
Follow us

|

Updated on: May 06, 2024 | 6:34 PM

అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రోజు బంగారం, వెండి వస్తువులు కొంటే మంచిదని, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని అందరూ నమ్ముతారు. దీంతో చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొంటూ ఉంటారు. అదే విధంగా శుభ కార్యక్రమాలు కూడా మొదలు పెడుతూ ఉంటారు. బంగారం, వెండి వస్తువులతో పాటు ఇతర వస్తువులు కూడా చాలా మంది కొంటూ ఉంటారు. పలు రకాల వస్తువులు ఈ రోజు కొనుగోలు చేయడం వల్ల.. ఇంట్లోకి లక్ష్మీ దేవి అడుగు పెడుతుందని నమ్ముతారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. చాలా మందికి తెలిసీ తెలియక కొన్ని రకాల వస్తువుల్ని కొంటూ ఉంటారు. అయితే వీటిని పొరపాటును కూడా కొనగోలు చేయకూడదట. అవి ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తాయట. అలాగే ఈ రోజు ఏం చేయాలో కూడా తెలుసుకుందాం.

ఏం చేయాలి..

అక్షయ తృతీయ రోజు వేద వ్యాస్ మహా భారతాన్ని రాయడం ప్రారంభించాడు. అందుకే ఈ రోజుని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో లక్ష్మీ దేవిని యధాశక్తి పూజించి.. స్తోమత ఉన్నంత వరకూ బంగారం లేదా వెండి కొనాలి. అంతే కాకుండా మీకు నచ్చిన వస్తువులు ఎవరికైనా దానం చేసినా మంచిదే. ఈ ప్రత్యేకమైన రోజున మర్రి చెట్టును పూజించాలి. తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చి నాటితే చాలా మంచిది.

అల్యూమినియం పాత్రలు కొనకండి:

అక్షయ తృతీయ రోజు మంచిదని.. చాలా మంది ఏదో ఒకటి కొనుగోలు చేస్తూ ఉంటారు. వాటిల్లో అల్యూమినియం పాత్రలు కూడా ఒకటి. ఆ పొరపాటు మాత్రం చేయకండి. ఆ రోజున అల్యూమినియం పాత్రలు కొంటే.. ఆర్థికంగా నష్టాలు వస్తాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి

పదునైన వస్తువులు కొనకూడదు:

చాలా మంది తెలిసీ తెలియక కొన్ని పొర పాట్లు చేస్తారు. అక్షయ తృతీయ రోజు.. కత్తెరలు, కత్తులు, సూదులు వంటి ముళ్ల వస్తువులు కొనకూడదు. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. అదే విధంగా ప్లాస్టిక్ వస్తువులు కూడా కొనుగోలు చేయడం మంచిది కాదు.

నలుపు రంగు వస్తువులు – బట్టలు కొనకూడదు:

అక్షయ తృతీయ రోజు నలుపు రంగు బట్టలు, వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు. వీటిని ఆ రోజున కొనడం వల్ల ఇంట్లో, మనుషులపై నెగిటివ్ ఎనర్జీ పడుతుంది. నలుపు రంగుకు ప్రతికూల శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..