AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?

ఇక మరికొందరైతే ఎలాగైనా త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో డైటింగ్ కూడా చేస్తుంటారు. సన్నగా అవ్వాలన్న కోరికతో కడుపుమాడ్చుకుంటారు. ఇందులో భాగంగానే రాత్రి పూట భోజనం చేయడం మార్చేస్తుంటారు. అయితే రాత్రి పూట మనం తీసుకునే ఆహారం కచ్చితంగా బరువుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం...

Lifestyle: బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
Dinner
Narender Vaitla
|

Updated on: May 06, 2024 | 5:41 PM

Share

బరువు కంట్రోల్‌లో ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. నాజుగ్గా ఉండాలని భావిస్తుంటారు. నిజానికి ఊబకాయంతో ఇబ్బంది పడే వారిలో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే బరువు తగ్గేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. కొందరు వర్కవుట్స్‌ చేస్తే మరికొందరు వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తుంటారు.

ఇక మరికొందరైతే ఎలాగైనా త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో డైటింగ్ కూడా చేస్తుంటారు. సన్నగా అవ్వాలన్న కోరికతో కడుపుమాడ్చుకుంటారు. ఇందులో భాగంగానే రాత్రి పూట భోజనం చేయడం మార్చేస్తుంటారు. అయితే రాత్రి పూట మనం తీసుకునే ఆహారం కచ్చితంగా బరువుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే త్వరగా భోజనం చేయాలని సూచిస్తుంటారు.

దీంతో మనలో చాలా మంది రాత్రి భోజనం చేయడాన్ని పూర్తిగా మానేస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపునణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడం విషయంలో రాత్రి పూట భోజనం మానేయడం వల్ల స్వల్పకాలిక ప్రయోజనాలు ఉంటుండొచ్చు కానీ దీర్ఘకాలంలో మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అలాగే ఆకలి కూడా పెరుగుతుంది. దీంతో ఉదయం పూట సహజంగానే ఎక్కువగా ఆహారం తీసుకుంటారు.

ఇక రాత్రుళ్లు భోజనం మానేయడం వల్ల సూక్ష్మపోషకాల లోపం సమస్య ఎదురవుతుంది. రాత్రి భోజనం దాటవేయడం వల్ల నిద్రకు ఆటంకాలు, శరీరం శక్తి స్థాయిలు తగ్గుతాయిని చెబుతున్నారు. వీటితో పాటు రక్తంలో చక్కెర స్థాయిల్లో తేడాలు ఏర్పాడుతాయి. ఈ కారణంగా శరీరం చేతులు వనకడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. అలాగే మధుమేహం ఉన్న వ్యక్తులు, రాత్రి డిన్నర్‌ స్కిప్‌ చేస్తే మరీ ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఇన్నోవేషన్ ఇన్ ఏజింగ్ అనే జర్నల్‌లో 2020లో ప్రచురించి అధ్యయనం ప్రకారం.. భోజనం మానేసిన వృద్ధులు డిప్రెషన్, యాంగ్జయిట, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కున్నట్లు తేలింది. సరైన సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..