Varanasi: తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకూ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న వ్యక్తులే చిన్న కారణాలతో కాలం చేస్తున్నారు. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయి. కారణమేదైనా ఎందరో యువకులు కళ్లముందే ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. తాజాగా మరో యువకుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉన్నపాటుగా కుప్పకూలిపోయాడు.

Varanasi: తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

|

Updated on: May 06, 2024 | 10:53 AM

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకూ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న వ్యక్తులే చిన్న కారణాలతో కాలం చేస్తున్నారు. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయి. కారణమేదైనా ఎందరో యువకులు కళ్లముందే ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. తాజాగా మరో యువకుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉన్నపాటుగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది.

నగరానికి చెందిన 32 ఏళ్ల దీపక్ గుప్తా రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంటాడు. పదేళ్లుగా క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుంటాడు. ఆరోగ్యంపై ఎంతగానో శ్రద్ధ చూపిస్తాడు. అలాగే ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపే దీపక్‌ సిటీతో పాటు చుట్టుపక్కల జరిగే ఫిట్ నెస్ కాంపిటీషన్లలో చురుగ్గా పాల్గొనేవాడు. రోజూలాగే గురువారం ఉదయం కూడా జిమ్ కు వెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడ్డాడు. విషయం తెలుసుకున్న అక్కడున్న మిగతా సభ్యులు దీపక్‌కు సపర్యలు చేసారు. అంతలోనే తలపట్టుకొని కూర్చున్న చోటనే స్పృహ తప్పి పడిపోయాడు. నేలమీద పడ్డ దీపక్ ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగిస్తుండగా దీపక్ నిలువెళ్లా వణికిపోతుండడం గమనించినట్లు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. దీపక్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణం పోయిందని తెలిపారు. జిమ్ లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డు కాగా.. ప్రస్తుతం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us