Goldy Brar: గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! స్పష్టం చేసిన అమెరికా..

Goldy Brar: గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! స్పష్టం చేసిన అమెరికా..

Anil kumar poka

|

Updated on: May 06, 2024 | 10:46 AM

భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. అమెరికాలోని హోల్ట్‌ అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతడు కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది.

భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. అమెరికాలోని హోల్ట్‌ అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతడు కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది. దాంతో రంగంలోకి దిగిన ఫ్రెస్నో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీబ్రార్‌ కాదని లెఫ్టినెంట్‌ విలియం జే డూలే వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ప్రచారం నమ్మవద్దని, అది పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. తమ డిపార్ట్‌మెంట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయని, అసలు ఈ పుకార్లు ఎలా మొదలయ్యాయో తెలియడంలేదని వివరించారు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్‌ గాల్డ్నె అని వెల్లడించారు.

గోల్డీ బ్రార్‌గా ప్రచారంలో ఉన్న సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీబ్రార్‌ భారత్‌లో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌. అతడు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన సిద్ధూ మూసేవాల హత్య కేసులో ఒక్కసారిగా ఇతడి పేరు మార్మోగింది. మరోవైపు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీబ్రార్‌ పేరు వినిపించింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో ఒకరు బుధవారం పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. నిందితులకు ఆయుధాలు సరఫరా చేసినట్లు భావిస్తున్న అనూజ్‌ తపన్‌ అనే వ్యక్తిని గత నెల 26న పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం అతడు లాకప్‌ గదిలో ఉన్న మరుగుదొడ్డిలో దుప్పటితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్డి నుంచి అనూజ్‌ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా అతడు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.