Puducherry: మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటలతోనే భానుడు తన ప్రాతాపాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగవచ్చని వాతావరణశాఖ చెబుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.
రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటలతోనే భానుడు తన ప్రాతాపాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగవచ్చని వాతావరణశాఖ చెబుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, ఆఫీసులు, ఇతరత్రా అవసరాల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితిలో పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. మండుతున్న ఎండలనుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగే వాహనదారులు ఎండలో ఇబ్బందిపడకుండా ఉండేందుకు గ్రీన్ నెట్స్‌తో పందిళ్ల మాదిరిగా ఏర్పాట్లు చేసింది.
రాష్ట్ర ప్రజా పనుల విభాగం ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా పలు సిగ్నళ్ల వద్ద కొంత దూరం వరకు ఈ గ్రీన్ షేడ్ నెట్స్ ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించేలా పుదుచ్చేరి అధికారులు చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

