Viral: ఆంధ్రాలో డబ్బు రాజకీయం.. బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో నేతలు ప్రచారంలో జోరు పెంచారు. రోడ్‌షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓటర్లకు పంచేందుకు నేతలు భారీ మొత్తంలో నగదు, బంగారం, మద్యం భారీగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, అధికారులు కూడా ఎన్నికల విధుల్లో బిజిబిజీగా ఉన్నారు.

Viral: ఆంధ్రాలో డబ్బు రాజకీయం.. బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు..

|

Updated on: May 06, 2024 | 11:20 AM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో నేతలు ప్రచారంలో జోరు పెంచారు. రోడ్‌షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓటర్లకు పంచేందుకు నేతలు భారీ మొత్తంలో నగదు, బంగారం, మద్యం భారీగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, అధికారులు కూడా ఎన్నికల విధుల్లో బిజిబిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటినుంచి ప్రతిరోజూ కోట్లలో నగదు, వందల కేజీల్లో బంగారం, భారీమొత్తంలో మద్యం పట్టుబడుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదును పోలీసులు సీజ్‌ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వెళ్తున్న శ్రీ వీరాంజనేయ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సర్కిల్‌ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles