Karnataka Elections: కర్నాటక ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణపై ఉంటుందా? నేతల రియాక్షన్ ఇదీ..!
నువ్వా-నేనా.. అన్నట్టుగా సాగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం తేలింది. క్లియర్ కట్‌గా జనతా చేతికి పట్టం కట్టారు. మరి కర్నాటక ముఖద్వారంగా సౌత్‌లో పాగా వేయాలనుకున్న బీజేపీ పరిస్థితి ఏంటి? సఫ్రాన్ రన్‌కు సౌత్‌లో నో ఎంట్రీనా? లేదంటే ఇకపై తెలంగాణను ద్వారంగా మలుచుకుంటుందా?.. అల్రెడీ సౌండ్ రానే వచ్చింది. కానీ కథ మరో లెవల్‌లో వుంది.
నువ్వా-నేనా.. అన్నట్టుగా సాగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం తేలింది. క్లియర్ కట్‌గా జనతా చేతికి పట్టం కట్టారు. మరి కర్నాటక ముఖద్వారంగా సౌత్‌లో పాగా వేయాలనుకున్న బీజేపీ పరిస్థితి ఏంటి? సఫ్రాన్ రన్‌కు సౌత్‌లో నో ఎంట్రీనా? లేదంటే ఇకపై తెలంగాణను ద్వారంగా మలుచుకుంటుందా?.. అల్రెడీ సౌండ్ రానే వచ్చింది. కానీ కథ మరో లెవల్‌లో వుంది. కర్నాటకలో విజయంతో టీ కాంగ్రెస్‌లో కొత్త ఆశలు చిగురించడమే కాదు.. అధికార పగ్గాలు చేజిక్కించుకోవడం ఖాయమంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. హస్తనేతల కొత్త ఉత్సాహం సరే కర్నాటక రిజల్ట్స్‌తో తెలంగాణ బీజేపీ డీలా పడిందా? బీఆర్‌ఎస్ సందిగ్ధంలో ఉందా?
కర్నాటక ఫలితాలు ఓ లెక్క. పక్కనున్న తెలంగాణలో మరో కత. కర్నాటక క్యాలిక్యూలేషన్ తెలంగాణలో వర్కవుటవుతుందా? ప్రత్యేక రాష్ర్ట ఆకాంక్షను నెరవేర్చినా సరే చతికలపడిన కాంగ్రెస్.. తెలంగాణలో పైచేయి సాధిస్తుందా? కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి కారణాలేంటి? రాహుల్ భారత్ జోడో యాత్రా కలిసొచ్చిందా? నిరోద్యోగ భృతి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలే గెలుపు పంటపడించాయా? లేదంటే కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు బీజేపీ ఆశలకు గండికొట్టాయా? సంకీర్ణ సర్కార్‌లో గోడలు దూకిన నేతలను ఈ ఎన్నికల్లో జనం ఓడించడం అందుకు నిదర్శనమా? ఇలా ఎన్నెన్నో విశ్లేషణలు. కారణాలేవైనా ఫలితం కళ్ల ముందుంది. కర్నాటక ఫలితాలు దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తాయా?.. డెఫినెట్‌గా చూపిస్తాయని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. అంత సీను లేదు. ఈ గాలి కర్నాటక బోర్డర్‌ను దాటే ప్రసక్తే లేదంటున్నారు బీజేపీ లీడర్స్.
గతం వేరు. ఇప్పుడు సీను వేరు. తెలంగాణలో ప్రధాన పోటీ ఎవరి మధ్య? అధికార బీఆర్‌ఎస్‌ను ఢీకొనేదెవరు?.. కర్నాటక ఫలితాల తరువాత గల్లీ గల్లీలో చర్చల లొల్లి రోడ్డెక్కింది. కర్నాటకలో విజయంతో టీ కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. మరి బీఆర్‌ఎస్.. బీజేపీ ఆవాజ్ ఏంటి? కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో ఎవరికి ఝలక్? బీఆర్‌ఎస్ కా? బిజేపీకా?
కర్నాటకలో ఓటమి ఎదురైనా ఓట్ల శాతంలో బీజేపీకి తిరుగులేదన్నారు ఆ పార్టీ నేత జీవీఎల్. కర్నాటకలో ఫలితాలు ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపే చాన్సే లేదనేది బీజేపీ లీడర్ల వాదన. ఈ ఇద్దరి లొల్లి సరే. మరి బీఆర్‌ఎస్, బీజేపీ స్పందన ఏంటి?
కర్నాటక ప్రజలను ఆకట్టుకోనే ప్రయత్నంలో ‘ది కేరళ స్టోరీ’ ఏవిధంగా విఫలమైందో.. ఎన్నికల్లో ఫలితాల్లో కూడా అదే రిఫ్లెక్టయిందని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవన్నారు. కానీ, టీ కాంగ్రెస్ మాత్రం కర్నాటక తరహాలో తెలంగాణలో పైచేయి సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. గాంధీభవన్‌లో సంబరాలు హోరెత్తాయి కూడా.
ఆశించడం.. అనుకోవడం తప్పు లేదు. కానీ కర్నాటక కాంగ్రెస్‌కు టీ కాంగ్రెస్‌కు మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందనేది కొందరి విశ్లేషణ. అక్కడ సిద్దరామయ్య – శివకుమార్ ఇద్దరు బడానేతలు తమ మధ్య ఇగోలను, విభేదాలు, వివాదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేశారు.
మరి ఇక్కడ.. ఎవరి దారి వారిదే.. నిత్య కలహాలు.. ఎవరితోవలో వాళ్ల పాదయాత్రలే నిదర్శనం.. గెలుపు ఎలా అనేది పక్కన పెట్టి సీనియర్ల గురి అంతా సీఎం సీటుపైనే.. ఏ ఇద్దరు నాయకులకు పొసగదు. నోటితో మాట్లాడుకుంటూ నొసటితో వెక్కిరించుకునే సంప్రదాయం తెలంగాణ కాంగ్రెస్‌లో ఉంది. కర్నాటకలో కాంగ్రెస్ నేతలు చేసింది మహాభారత యుద్ధమని తెలంగాణ కాంగ్రెస్ నేతలే అంటున్నారు. మరి ఆ తరహా యుద్ధం తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేయగలరా? విభేదాలు పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లగలరా? చూడాలి మరి ఏం జరుగుతుందో.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..