వైఎస్ జగన్‎తో భేటీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ.. ఏమన్నారంటే..

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‎తో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ ఆయినట్లు అనేక వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తనను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. తాను జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, తప్పుడు ఫోటోలు చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనిని ఎవరూ నమ్మకండంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గతంలో అనేక కథనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

వైఎస్ జగన్‎తో భేటీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ.. ఏమన్నారంటే..
Deputy Cm Dk Shivakumar
Follow us
Srikar T

|

Updated on: Jul 01, 2024 | 8:05 AM

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‎తో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ ఆయినట్లు అనేక వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తనను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. తాను జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, తప్పుడు ఫోటోలు చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనిని ఎవరూ నమ్మకండంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గతంలో అనేక కథనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వైసీపీని.. కాంగ్రెస్‎లో విలీనం చేస్తానని కర్ణాటక పీసీసీ చీఫ్ ముందు వైఎస్ జగన్ ఒక ఆఫర్ ప్రకటించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తన సోదరి షర్మిలను ఏపీ కాంగ్రెస్ నుంచి తప్పించాలని ఒక షరతు కూడా పెట్టినట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. అలాగే ఏపీలో సీఎం చంద్రబాబుతో, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డితో ఇబ్బందులు తప్పవని భావించినట్లు కూడా అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే దీనిపై కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారని, కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి నిర్ణయం వెలువరిస్తానిని హామీ ఇచ్చినట్లు కూడా అనేక పుకార్లు షికారు చేశాయి. వీటన్నింటినీ ఖండిస్తూ డీకే శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. దీంతో మొన్నటి వరకూ వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవాలని తేలిపోయింది. అయితే ఇలాంటి వార్తలు నిజమని నమ్మేందుకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు కొందరు రాజకీయ నిపుణులు. వైఎస్ఆర్సీపీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీ అసెంబ్లీలో 11, పార్లమెంట్‎లో 4 సీట్లకు పరిమితం అయింది. దీనికి తోడూ గతంలోని సీబీఐ, ఈడీ కేసులు, ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ సత్సంబంధాలు కొనసాగించడం ఇవన్నీ కలిసి తనకు ఎదురుదెబ్బ తప్పదని భావించి ఉంటారని అనుకున్నారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావించారు. ఏది ఏమైనా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ట్వీట్ తో అన్ని పుకార్లకు తెరతొలిగిన్లయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..