సీన్ రిపీట్.. బీహార్‌లో కుంగిన మరో వంతెన.. కష్టాల్లో చిక్కుకున్న 60వేల మంది స్థానికులు..!

వంతెన కూలిపోవడంతో పైనాపిల్, అరటి, తేయాకు తదితర పంటలు సాగుచేసే రైతులు, రోజూ బెంగాల్‌కు వెళ్లే రైతులు చాలా నష్టపోతారని చెప్పారు. వంతెన నెమ్మదిగా మునిగిపోతోందని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయకుంటే త్వరలోనే కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

సీన్ రిపీట్.. బీహార్‌లో కుంగిన మరో వంతెన.. కష్టాల్లో చిక్కుకున్న 60వేల మంది స్థానికులు..!
Bihar Bridge Collapse
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2024 | 8:42 AM

బీహార్‌లో వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతున్నాయి. బ్రిడ్జీలు కూలడం, పిల్లర్లు కొట్టుకుపోవడం వంటి వరుస ఘటనలు బీహార్‌లో సంచలనంగా మారాయి. గత పదిహేను రోజులలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అనేక వంతెనలు ధ్వంసమయ్యాయి. పిల్లర్లు నేలకూలాయి. తాజాగా మరో వంతెన వరదనీటి ప్రవాహానికి తట్టుకోలేకపోయింది. దాని స్తంభాలలో ఒకటి లోపలికి కుంచించుకు పోయింది. ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేస్తే, వేలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. కిషన్‌గంజ్‌లోని ఠాకూర్‌గంజ్‌లో బండ్ నీడ్‌పై నిర్మించిన వంతెన పునాది రెండు అడుగుల వరకు కుంగిపోయింది. ఈ వంతెన కుంగిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో వంతెన పునాది రెండు అడుగుల మేర కుంగిపోయిందని చెబుతున్నారు.

కిషన్‌గంజ్ జిల్లా ఠాకూర్‌గంజ్ బ్లాక్‌లో భారీ వర్షాల కారణంగా నది నీటిమట్టం పెరిగింది. బండ్ నదిపై నిర్మించిన వంతెన పిల్లర్ దాదాపు 1 అడుగు మేర కుంగిపోయింది. ఈ వంతెన ఠాకూర్‌గంజ్‌లోని పఠారియా పంచాయతీలోని ఖోషి డాంగి గ్రామంలో ఉంది. దీనిని 2007-2008లో అప్పటి ఎంపీ మహ్మద్ తస్లీముద్దీన్ ఎంపీ నిధుల నుంచి నిర్మించారు. ఇటీవల వచ్చిన వరద నీటి ఒత్తిడిని ఈ వంతెన తట్టుకోలేకపోయింది. దీని స్తంభం ఒకటిన్నర అడుగుల మేర మునిగిపోయింది.

ఈ వంతెన మూడు, నాలుగు పంచాయతీలను కలుపుతుందని మాజీ ప్రధానాధికారి జవహర్‌సింగ్‌ తెలిపారు. బ్రిడ్జి కూలితే 50 నుంచి 60 వేల మంది ప్రజలు నష్టపోతారు. వంతెన కూలిపోవడంతో పైనాపిల్, అరటి, తేయాకు తదితర పంటలు సాగుచేసే రైతులు, రోజూ బెంగాల్‌కు వెళ్లే రైతులు చాలా నష్టపోతారని చెప్పారు. వంతెన నెమ్మదిగా మునిగిపోతోందని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయకుంటే త్వరలోనే కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..