AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూటీలో దూరిన కొండచిలువ.. ఎక్కడ దాక్కుందో చూస్తే షాక్ అవుతారు..వైరలవుతున్న వీడియో

పాము చిన్నదైనా సరే.. అసలది కనపడితేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అక్కడెక్కడో పాము ఉందంటే.. చాలు.. ముందే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఓ చిన్న పాము మన బైక్ లోనో, బ్యాగ్ లోనో దూరిపోతే భయంతో బిక్క చచ్చిపోతాం. దాన్ని బయటకు తీయడమెలా?అని వణికిపోతాం.. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

స్కూటీలో దూరిన కొండచిలువ.. ఎక్కడ దాక్కుందో చూస్తే షాక్ అవుతారు..వైరలవుతున్న వీడియో
Snake Found On Scooter
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2024 | 8:12 AM

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పాము వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కొండచిలువ స్కూటీ పెట్రోల్ ట్యాంక్‌ను చుట్టుకుని హాయిగా సేదతీరుతోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించింది. ఊహించని, ఆశ్చర్యకరమైన ఈ ఘటన అనేక మంది వినియోగదారులను ఆకర్షించింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియలేదు. కానీ, సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు మలయాళం మాట్లాడుకోవటం వినిపించింది. దీంతో ఇది బహుశా కేరళలో జరిగిన సంఘటనగా నెటిజన్లు భావిస్తున్నారు.

పాములంటే అందరికీ భయమే.. దగ్గరికి వెళితే.. ఎక్కడ కాటేస్తుందో అని ముందే హడలిపోతాం. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది సామెత. పాము చిన్నదైనా సరే.. అసలది కనపడితేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అక్కడెక్కడో పాము ఉందంటే.. చాలు.. ముందే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఓ చిన్న పాము మన బైక్ లోనో, బ్యాగ్ లోనో దూరిపోతే భయంతో బిక్క చచ్చిపోతాం. దాన్ని బయటకు తీయడమెలా?అని వణికిపోతాం.. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోను Salihkt Mullambath అనే Instagram ఖాతా ద్వారా అప్‌లోడ్ చేసారు. కాగా, వీడియో వేగంగా వైరల్‌ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఊహించని రీతిలో పాము కనిపించడంతో వీక్షకులు షాక్‌కు గురయ్యారు. వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి పొడవాటి కర్రతో స్కూటర్ సీటును జాగ్రత్తగా ఎత్తటం కనిపించింది. స్కూటర్‌లోని పెట్రోల్ ట్యాంక్ చుట్టూ పాము చుట్టుకుని ఉండటం ఫుటేజీలో కనిపించింది. షాకింగ్‌ వీడియో చూసిన ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా కామెంట్‌ చేశారు. వాహనంలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉందో లేదో తనిఖీ చేసేందుకు పాము వచ్చిందని ఓ వినియోగదారు వ్యాఖ్యానించారు. ఇది విషపూరితం కాని భారతీయ రాక్ పైథాన్ (పెరుమ్ పాంబు) అని మరొక వినియోగదారు పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..