Viral Video: వామ్మో.. ఇదేం చేపరా సామీ.. చిరుత కంటే స్పీడ్‌గా ఉంది..! గాల్లో ఎగురుతున్న ఎరను ఎలా పట్టేసిందో చూస్తే..

ఈ వీడియోలో కనిపించే చేప ఆఫ్రికన్ టైగర్ ఫిష్. భయంకరంగా వేటాడే చేప ఇది. నీళ్లలో ఇది చిరుతపులి కంటే వేగంగా తన ఎరను పట్టుకుంటుంది. ఈ చేపలు తరచుగా నీటి నుండి పైకి దూకి గాల్లో ఎగిరే పక్షులను వేటాడతాయి. దీని వేగం, చురుకుదనం వల్ల దీనికి టైగర్ ఫిష్ అనే పేరు వచ్చింది. ఈ చేపలు ప్రధానంగా

Viral Video: వామ్మో.. ఇదేం చేపరా సామీ.. చిరుత కంటే స్పీడ్‌గా ఉంది..! గాల్లో ఎగురుతున్న ఎరను ఎలా పట్టేసిందో చూస్తే..
Tiger Fish Caught Flying Bird
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 30, 2024 | 12:25 PM

సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి..ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో ఊహించలేం. ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన చాలా వీడియోలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు ఈ వీడియోలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. వీటిలో కొన్ని భయంకరంగా కూడా ఉంటాయి. కొన్ని జంతువుల వేటకు సంబంధించినవి కూడా వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో బయటకు వచ్చింది. అది మిమ్మల్ని ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టేలే చేస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం…

సముద్రంలో కొన్ని రహస్య జీవుల ఫొటోలు, వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫోటోలు, వీడియోలు చూసిన తర్వాత మీ కళ్లను మీరే నమ్మలేరు. ఇలాంటి వాటిలో అనేక రకాల చేపలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి. ఈ చేపలు ఎరను చూడగానే పట్టుకుంటాయి. వీటిలో ఒకటి టైగర్ ఫిష్. దీని వేగం చిరుతపులిలాగా ఉంటుందని చెబుతారు. ఈ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేపలు తమ వేటను ఎలా పట్టుకుంటాయో ఈ వీడియోలో చూడొచ్చు. క్షణాల్లోనే ఆ చేప గాల్లో ఎగురుతున్న పక్షిని పట్టుకుంది. చేప వేగాన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంత స్పీడ్‌తో చేప పక్షిని డేగాలా వేటాడి ఎత్తుకుపోవటాన్ని ఇప్పటివరకు యూజర్లు చూడలేదు.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పక్షి నదిపై ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆ మరు క్షణంలో తాను చనిపోతానని పాపం పేద పక్షికి తెలియదు. అడవిలో పులి తన ఎరను చాలా చాకచక్యంగా పట్టుకున్నట్లే, ఈ చేప నీటిలో తన చాకచక్యాన్ని ప్రదర్శించింది. పక్షులు విమానంలా ఆకాశంలో ఎగరగలవు. కానీ, ఈ పక్షికి అలాంటి అవకాశం రాలేదు. సముద్రంపై ఎగురుతున్న పక్షిని రెప్పపాటులో పట్టేసుకుంది టైగర్‌ ఫిష్‌. పక్షిని నోటితో పట్టేసుకుని అదే మెరుపు వేగంతో తిరిగి నీటిలోకి వెళ్లిపోయింది. దాని వేగం చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇలాంటి వేట మీరు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండకపోవచ్చు. ఈ వీడియోలో చేపలు పక్షిని వేటాడం నిజంగా షాకింగ్‌గానే ఉంటుంది.

ఈ వీడియోలో కనిపించే చేప ఆఫ్రికన్ టైగర్ ఫిష్. భయంకరంగా వేటాడే చేప ఇది. నీళ్లలో ఇది చిరుతపులి కంటే వేగంగా తన ఎరను పట్టుకుంటుంది. ఈ చేపలు తరచుగా నీటి నుండి పైకి దూకి గాల్లో ఎగిరే పక్షులను వేటాడతాయి. దీని వేగం, చురుకుదనం వల్ల దీనికి టైగర్ ఫిష్ అనే పేరు వచ్చింది. ఈ చేపలు ప్రధానంగా నమీబియాలోని చోబ్, జాంబేజీ నదులలో కనిపిస్తాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @namibia_africa అనే ఖాతా ద్వారా వీడియోను షేర్‌ చేశారు. వీడియోను ఇప్పటి వరకు 530,000 కంటే ఎక్కువ మంది లైక్‌ చేశారు. మిలియన్లకు పైగా జనం ఈ వీడియోని వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..