Instagram Reels: 18ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముడు.. ఇన్‌స్టా రీల్ కలిపింది..! ఎలాగంటే..?
ఇన్‌స్టాలో అతడిని సంప్రదించి చిన్నప్పడు తాను తమ్ముడితో గడిపిన విషయాలు తనకు వివరించింది. వాటికి అతడు కూడా సరిగ్గా స్పందించడంతో అతడు తన తమ్ముడేనని నిర్ధారణ అయ్యింది. దీంతో జైపూర్‌లో ఉంటున్న అతడు 18 ఏళ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తప్పిపోయిన తన తమ్ముడిని సోషల్ మీడియా కలిపిందని రాజ్‌కుమారి ఎంతో సంతోషిస్తూ చెప్పింది.
మనమందరం ప్రతిరోజూ ఇన్‌స్టాగ్రామ్‌లో కనీసం రెండు-మూడు రీల్స్ చూస్తాము. ఈరోజుల్లో రీళ్లు, మీమ్స్ మన జీవితంలో భాగమైపోయాయంటే కూడా తప్పేం లేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagram లోని ఈ రీల్స్, మీమ్‌లు కేవలం వినోదానికి మాత్రమే కాదు.. ఎప్పుడో విడిపోయిన కుటుంబాలను కూడా కలుపుతాయంటే నమ్మగలరా..? కానీ, సరిగ్గా అదే జరిగింది. ఒక అక్కా తమ్ముళ్లను కలిపింది ఇన్‌స్టా రీల్. ఈ విచిత్ర సంఘటన యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం, చిన్నతనంలో ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన తమ్ముడిని ఒక అక్క ఇన్‌స్టా రీల్ ద్వారా గుర్తు పట్టింది. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ, ఇన్‌స్టా వేదికగా ఇదే జరిగింది.
యూపీలోని హతిపూర్‌కు చెందిన రాజ్‌కుమారి మొబైల్‌లో ఒక రీల్స్ వీడియో చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన అతని పన్ను చూసి 18 ఏళ్ల క్రితం ఇంట్లోంచి ముంబై వెళ్లిన తన తమ్ముడు బాల్ గోవింద్‌లా ఉన్నాడని అనుమానించింది. ఇన్‌స్టాలో అతడిని సంప్రదించి చిన్నప్పడు తాను తమ్ముడితో గడిపిన విషయాలు తనకు వివరించింది. వాటికి అతడు కూడా సరిగ్గా స్పందించడంతో అతడు తన తమ్ముడేనని నిర్ధారణ అయ్యింది. దీంతో జైపూర్‌లో ఉంటున్న అతడు 18 ఏళ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తప్పిపోయిన తన తమ్ముడిని సోషల్ మీడియా కలిపిందని రాజ్‌కుమారి ఎంతో సంతోషిస్తూ చెప్పింది.
18 ఏళ్ల క్రితం, బాల్ గోవింద్ ముంబైలో ఉద్యోగం కోసం ఫతేపూర్‌లోని ఇనాయత్‌పూర్ గ్రామం నుండి వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. ముంబై చేరుకున్న తర్వాత స్నేహితులను వదిలి వేరే చోట పని చేయడం ప్రారంభించాడు. మొదట్లో తన స్నేహితులతో సంబంధాలు కొనసాగించినా క్రమంగా వారితో సంబంధాలు తెగిపోయాయి. అతని స్నేహితులందరూ గ్రామానికి తిరిగి వచ్చారు. కాని బాల్ గోవింద్ ముంబైలోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే చిన్న తనంలో ఒకనాడు బాల్ గోవింద్ జీవితంలో ఒక ప్రధాన మలుపు తిరిగింది.
చిన్నతనంలో అతను ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు ఇంటికి తిరిగి రావాలని రైలులో బయల్దేరాడు. కానీ, ఆ రైలు అతన్ని కాన్పూర్ బదులు జైపూర్ తీసుకెళ్లింది. అలసిపోయి, బాధతో ఉన్న బాల్ గోవింద్ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తిని కలిశాడు. అతని ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అతనికి ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. క్రమంగా, బాల్ గోవింద్ పరిస్థితి మెరుగుపడింది. అలా అతను తన జీవితాన్ని జైపూర్‌లో స్థిరపరచడం ప్రారంభించాడు. అతను ఈశ్వర్ దేవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. సంవత్సరాలుగా చాలా మార్పులు వచ్చాయి, కానీ అతని విరిగిన పంటి గుర్తు మాత్రం అలాగే ఉంది. కొత్త జీవితంలో అతను జైపూర్ దృశ్యాలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయటం అలవాటుగా చేసుకున్నాడు. ఆ రీల్ చూస్తుండగా తన అక్కకు బాల్ గోవింద్ ఆచూకీ లభించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..