AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!

ఇది సహజమైన స్కిన్ ఎక్స్‌ఫోలియంట్. ఇది మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. మీరు వర్షాకాలంలో కూడా మెరిసే చర్మం కావాలంటే పాలను ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో వచ్చే మొటిమలను పాలతో తొలగించుకోవచ్చు. దీంతో మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందుతారు. పాలతో మెరిసే చర్మం పొందడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
milk for natural glowing skin
Jyothi Gadda
|

Updated on: Jun 30, 2024 | 10:26 AM

Share

ఈ రోజుల్లో ఆడవారితో పాటు మగవారు కూడా మెరిసే చర్మం కోరుకుంటున్నారు. దీని కోసం ఇప్పుడు స్త్రీ పురుషులిద్దరూ పార్లర్లకు వెళ్లి నెలనెలా చాలా ఖర్చు చేస్తున్నారు. మెరిసే చర్మం కోసం మార్కెట్‌లో లభించే అనేక రకాల ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను వాడుతుంటారు. కానీ వాటి తయారీ కోసం అనేక రకాల హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తారు. దీని కారణంగా మీ చర్మం రోజురోజుకు నిస్తేజంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే గ్లోయింగ్ స్కిన్ కోసం ఎప్పుడూ నేచురల్ వస్తువులనే వాడాలని అంటారు. మెరిసే చర్మం కోసం మీరు పాలను ఉపయోగించవచ్చు. పాలలో విటమిన్ ఎ, డి ఇ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వేసవిలో వడదెబ్బను తగ్గిస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది సహజమైన స్కిన్ ఎక్స్‌ఫోలియంట్. ఇది మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. మీరు వర్షాకాలంలో కూడా మెరిసే చర్మం కావాలంటే పాలను ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో వచ్చే మొటిమలను పాలతో తొలగించుకోవచ్చు. దీంతో మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందుతారు. పాలతో మెరిసే చర్మం పొందడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

పాలతో స్నానం: మెరిసే చర్మం కోసం మీరు నెలకు ఒకసారి పాల స్నానం చేయవచ్చు. దీని కోసం 3 కప్పుల పాలలో 10-15 పుదీనా ఆకులు, 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1/2 కప్పు, 1 కప్పు ఉప్పు, మొక్కజొన్న పిండిని కలుపుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో ఇవన్నీ బాగా కలపండి. ఈ ద్రవ మిశ్రమాన్ని మీ బాత్‌టబ్‌లో పోసి కనీసం 20 నిమిషాల పాటు టబ్‌లో కూర్చోండి.

క్లెన్సింగ్ మిల్క్‌ తయారు చేసుకోవచ్చు : మీరు సహజ పదార్ధాల సహాయంతో ఇంట్లోనే క్లెన్సింగ్ మిల్క్‌ని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పాలలో తేనె, చిటికెడు పసుపు కలిపి క్లెన్సింగ్ మిల్క్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఈ క్లెన్సింగ్ మిల్క్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఈ క్లెన్సింగ్‌ మిల్క్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు.

ఇవి కూడా చదవండి

ఫేస్ ప్యాక్ సిద్ధం చేయండి: పచ్చి పాలను ఉపయోగించడం ద్వారా మెరిసే చర్మం కోసం ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. దీని కోసం పచ్చి పాలలో శెనగపిండి, ముల్తాని మిట్టి, పసుపు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. మీరు ప్రతిరోజూ స్నానం చేసే ముందు ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..