AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..? జరిగే మిరాకిల్స్ చూడండి!!

రోజుకు కనీసం రెండుసార్లు ఇలా పాదాలను శుభ్రం చేసుకుంటూ జాగ్రత్త వహించండి. ఒకసారి స్నానం చేస్తున్నప్పుడు, రాత్రి పడుకునే ముందు. అయితే రాత్రి పడుకునే ముందు కాళ్లను కడగడం మర్చిపోవద్దు. కనీసం వారానికి రెండు సార్లు మీ పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి వాష్‌ చేసుకోవాలి.. ఇలా చేయడం వల్ల కీళ్లు, కండరాలు రిలాక్స్ అవుతాయి. సుఖంగా నిద్రపడుతుంది.

రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..? జరిగే మిరాకిల్స్ చూడండి!!
Wash Your Feet Before Bed
Jyothi Gadda
|

Updated on: Jun 30, 2024 | 9:55 AM

Share

ఆరోగ్యకరమైన జీవితంలో చేతులు, ముఖాన్ని శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు కాళ్లు కడుక్కోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పగలంతా కష్టపడి రాత్రిపూట నిద్ర తప్పనిసరి అయితే, మంచి నిద్ర కోసం కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. మన రోజువారీ జీవితంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, చర్మ సంరక్షణతో పాటు పాదాల సంరక్షణ కూడా అవసరం. ఎందుకంటే పాదాలు శుభ్రంగా ఉంటే మంచి నిద్ర మాత్రమే కాదు, అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కాళ్లు బాగా కడుక్కుని నిద్రపోతే మంచి నిద్ర వస్తుంది. మీరు మీ పాదాలను అపరిశుభ్రంగా ఉంచుకుంటే, అది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. వివిధ వ్యాధులకు కారణంగా మారుతుంది.

రాత్రి పడుకునే ముందు మీ పాదాలను కడుక్కోకపోతే, మంచం సూక్ష్మక్రిములకు ఆధారం అవుతుంది. రాత్రి పడుకునే ముందు మీ ముఖం, చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో, మీరు మీ పాదాలను కూడా కడగాలి. ఎందుకంటే ఇంట్లో, బయట ఉండే మురికి, ధూళి సులభంగా పాదాల్లోకి చేరుతుంది. అలాగే మీరు రోజు షూస్ వేసుకుంటే పాదాలకు సహజంగా చెమట పడుతుంది. ఫలితంగా పాదాలను శుభ్రం చేయకపోతే, అది వివిధ మార్గాల్లో శరీరంపై ప్రభావం చూపుతుంది.

అపరిశుభ్రమైన పాదాలతో పడుకోవడం వల్ల బ్యాక్టీరియాతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. పాదాల చర్మ సమస్యలకు కారణమవుతుంది. ఇది దురద, ఎరుపు, పొట్టు, పగుళ్లు, పొక్కులు, వాపు వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. పాదాల పగుళ్లు సర్వసాధారణమే అయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే అవి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. కొన్నిసార్లు సర్జరీలకు వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

అవసరమైన జాగ్రత్తలు: మీ పాదాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉండటానికి బయటికి వెళ్లిన వచ్చిన తర్వాత పాదాలను కడగాలి. రోజుకు కనీసం రెండుసార్లు ఇలా పాదాలను శుభ్రం చేసుకుంటూ జాగ్రత్త వహించండి. ఒకసారి స్నానం చేస్తున్నప్పుడు, రాత్రి పడుకునే ముందు. అయితే రాత్రి పడుకునే ముందు కాళ్లను కడగడం మర్చిపోవద్దు. కనీసం వారానికి రెండు సార్లు మీ పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి వాష్‌ చేసుకోవాలి.. ఇలా చేయడం వల్ల కీళ్లు, కండరాలు రిలాక్స్ అవుతాయి. సుఖంగా నిద్రపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..