TOP9 ET: అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్ | అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ తాజాగా అంజన్నకు ముడుపులు చెల్లించారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కోరిక కోర్కెలు తీర్చినందుకు స్మామి వారికి మొక్కలు అప్పజెప్పారు. ఇక గతంలో ఏపీ ప్రచార పర్వం మొదలెట్టే ముందు.. తన ప్రచార రథం వారాహితో కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు పవన్‌. ఆ క్రమంలోనే ఏపీ ఎలక్షన్స్‌లో గెలిస్తే మళ్లీ వచ్చి దర్శించుకుంటా నంటూ మొక్కుకున్నారు.

TOP9 ET: అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్ | అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్ కళ్యాణ్..

|

Updated on: Jun 30, 2024 | 3:20 PM

01.kalki day2 collections day2: అమాంతంగా పెరిగిపోయిన కల్కి కలెక్షన్స్.

డే2.. కల్కి కలెక్షన్స్ అమాంతంగా పెరిగిపోయాయి. దాదాపు రెండింతలు అయిపోయాయి. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కి.. రీసెంట్‌గా రిలీజ్ అయిన కల్కి మూవీ డే 1.. 191.5 క్రోర్ గ్రాస్‌ను కమాయించింది. ఇక డే2.. దిమ్మతిరిగే రేంజ్‌లో 298.5 క్రోర్ గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం.. ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసి రివీల్ చేసింది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అన్‌లిమిటెడ్ ఖుషీకి కారణం అయింది.

02.pawan: అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్‌.

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ తాజాగా అంజన్నకు ముడుపులు చెల్లించారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కోరిక కోర్కెలు తీర్చినందుకు స్మామి వారికి మొక్కలు అప్పజెప్పారు. ఇక గతంలో ఏపీ ప్రచార పర్వం మొదలెట్టే ముందు.. తన ప్రచార రథం వారాహితో కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు పవన్‌. ఆ క్రమంలోనే ఏపీ ఎలక్షన్స్‌లో గెలిస్తే మళ్లీ వచ్చి దర్శించుకుంటా నంటూ మొక్కుకున్నారు. ముడుపులు కట్టారు. ఇక ఇప్పుడు ఆ మొక్కులు చెల్లించుకునేందుకే కొండగట్టుకు వచ్చారు పవన్‌.

03.pawan: పవన్ ధాటికి ఊగిపోయిన కొండగట్టు 😳

ఇక పవన్‌ ధాటికి కొండగట్టు ఊగిపోయింది. కొండగట్టు దారిపొడవునా.. పవన్‌ అభిమానుల హంగామా కనిపించింది. గజమాలలు.. ఊలలు.. గోలలతో.. పవన్‌కు అడుగడుగునా.. అభిమానుల నుంచి ఘణంగా స్వాగతం లభించింది. ఇక ఏపీ ఎలక్షన్స్‌లో విజయకేతనం ఎగరవేసి.. ఉపముఖ్యమంత్రిగా కొలుదీరాక.. పవన్‌ మొదటి సారి.. తెలంగాణకు..అందులోనూ తన ఇంటిదైవమైన అంజన్న దర్శనానికి రావడంతో.. గుడి ప్రాంగణం కూడా అభిమానులతో నిండిపోయింది. కిక్కిరిసిపోయింది.

04. mohan babu: బావ.. నీ సినిమా అద్భుతం! 🤩🥳

మోహన్ బాబు.. ప్రభాస్‌ మధ్య ఎప్పటి నుంచో మంచి బాండ్‌ ఉంది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఈవెంట్స్‌లోనూ… ఇద్దరూ బావ బావ అని పిలుచుకుంటూ.. ఆప్యాయత కురిపించుకోవడం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈక్రమంలోనే మోహన్ బాబు కల్కి మూవీ చూసి.. సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ రివ్యూ ట్వీట్ చేశారు. ఇక తన ట్వీట్లో.. ఈ రోజే కల్కి మూవీ చూశానని చెప్పిన మోహన్ బాబు.. కల్కి మూవీ అద్భుతం.. మహాద్భుతం అంటూ రాసుకొచ్చారు. మా భావ ప్రభాస్కి.. అమితాబ్‌కి.. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్‌కి అభినందనలు చెప్పారు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నా అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు మోహన్ బాబు.

05.ali: దోస్తాన్ పిలుస్తోంది..

ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తన రూలింగ్ స్టార్ట్ చేశారు. మరో పక్క కమెడియన్ అలీ.. వైసీపీకి రాజీనామా చేసి.. రాజకీయాలకు ఇక దూరం దూరం అంటూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ రెండు వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ.. మళ్లీ వీళ్లిద్దరూ కలవాలంటూ.. నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. కామెంట్ చేయడమే కాదు.. గతంలో వీరిద్దరి దోస్తాన్ గురించి పవన్ కళ్యాణ్ అమ్మ అంజనమ్మ మాట్లాడిన వీడియోను కూడా ట్యాగ్ చేస్తున్నారు.

06. ashwini dutt: కల్కి 2 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్ 🤩

కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్టైపోయింది. రికార్డ్‌ లెవల్లో కలెక్షన్స్‌ను రాబడుతోంది. దాంతో పాటే.. పార్ట్‌ 2 పై ఎక్కడ లేని అంచనాలను పెంచేసింది. ఈ సినిమా గురించి అందరూ ఆరా తీసేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే కల్కి 2 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్‌. కల్కి పార్ట్ 2 ఆల్రెడీ 60 శాతం షూటింగ్ ఫినిష్ అయిందని.. ఇంకో 40 పర్సెంట్ తొందర్లో ఫినిష్ చేసి.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు ఈయన. అయితే ప్రస్తుతం అశ్వినీదత్ ఇచ్చిన ఈ అప్డేట్.. సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది.

07. hhvm: బిగ్ ట్రబుల్లో హరి హర మూవీ.. పవన్‌ రియాక్షన్ ఏంటి.?

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ హరి హర వీర మల్లు బిగ్ ట్రబుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఓ ఓటీటీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఈ మూవీ టీం.. అగ్రిమెంట్లో భాగంగా.. హరి హర వీర మల్లు సినిమాను 2024లోనే రిలీజ్ చేయాల్సి ఉంది. అలా కాని పక్షంలో ఆ ఓటీటీ సంస్థకు భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక మరో పక్క ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్‌ లోనే ఉంది. పవన్‌ ఇమ్మీడియెట్‌గా డేట్స్‌ ఇస్తే కానీ.. ఈ మూవీ షూటింగ్ ఈ ఇయర్‌లోనే కంప్లీట్ అవదనే టాక్ ఉంది. అంతేకాదు ఈ ఇష్యూను.. ఈ మూవీ మేకర్స్ పవన్‌ దృష్టికి తీసుకెళ్లారని ఇన్‌సైడ్ టాక్. కానీ ఈ ట్రబుల్‌పై పవన్ రియాక్షన్ ఏంటనేది మాత్రం ఇప్పటికి సస్పెన్స్‌.

08.fahad fajil: పుష్ప విలన్‌పై కేసు నమోదు.. చిక్కుల్లో స్టార్ 😳

పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ చిక్కుల్లో పడ్డారు. ఈయన నటిస్తూ నిర్మిస్తున్న పెయిన్కిలీ సినిమాలోకి కొన్ని సీన్లను ఇటీవల ఎర్నాకులం లోని ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చిత్రీకరించారు. రాత్రిళ్లు షూటింగ్ చేస్తూ ఎమర్జెన్నీ వార్డులోని రోగులకు ఇబ్బందిపెట్టారు. కొందరు రోగులను లోపలికి అనుమతించకుండా అతి చేశారు. అయితే ఈ వ్యవహారం బయటికి రావడంతో.. దీన్ని సుమోటాగా తీసుకున్న మానవ హక్కుల సంఘం,.. ఈస్టార్ హీరో పై కేసు నమోదు చేసింది. దీంతో ఫహాద్ చిక్కుల్లో పడినట్టు అయింది.

09.samantha: ‘గతంలో నేను తప్పు చేసిన మాట వాస్తవమే’ 😳

ఎట్ ప్రజెంట్ పాడ్ కాస్ట్ వీడియోలు చేస్తూ బిజీగా ఉన్న సమంత.. తన రీసెంట్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో తాను తప్పు చేసిన మాట వాస్తవమే అంటూ ఒప్పుకున్నారు. హెల్త్‌ పై అవగాహన కల్పించేందుకు పాడ్ కాస్ట్ షో చేస్తన్న సమంతకు ఓ నెటిజన్‌ నుంచి ప్రశ్న ఎదురైంది. ‘ఇప్పుడు ఇవన్నీ బానే చెబుతున్నారు . కానీ ముందు మీరే అనారోగ్యకరమైన బ్రాండ్స్ ప్రమోట్ చేశారు కదాని..!” అయితే ఈ నెటిజన్‌కు ఆన్సర్‌ ఇస్తూనే.. తాను గతంతో తప్పులుచేసిన వాస్తమే అంటూ.. షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అవన్నీ పూర్తిగా తెలియక చేసినవి. ఆ తర్వాత పూర్తిగా వాటికి ప్రమోషన్స్ చేయడం ఆపేశా. ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో వాటి గురించి మాత్రమే చెబుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!