AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కేదార్‌నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం.. భయానక వీడియో వైరల్‌

ఈ పర్వతంపై అప్పుడప్పుడు ఇలాంటి హిమపాతాలు జారుతుంటాయని చెప్పారు. కొండలపై బాగా మంచు పేరుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అన్నారు. అయితే ఈ హిమపాతాలు ఎలాంటి నష్టం కలిగించవని వెల్లడించారు. మరోవైపు కేదార్‌నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం దూసుకొచ్చిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Watch: కేదార్‌నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం.. భయానక వీడియో వైరల్‌
Kedarnath
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2024 | 7:45 AM

Share

ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర ప్రారంభం నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. హరహర శంభోశంకర నినాదాలతో కేదార్‌నాథ్ వైపు భక్తులు బారులు తీరుతున్నారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున గాంధీ సరోవర్ కొండలపై నుంచి హితపాతం దూసుకొచ్చింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కేదార్‌నాథ్‌లోని గాంధీ సరోవర్‌పై హిమపాతం సంభవించినట్లు రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ విశాఖ అశోక్ భదానే తెలిపారు. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని చెప్పారు.

కేదార్‌నాథ్‌లో ఈ హిమపాతానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆలయం వెనుక ఉన్న పర్వతంపై అకస్మాత్తుగా హిమపాతం సంభవించినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. హిమపాతంలో కూలిన మంచు అధిక వేగంతో దూసుకొచ్చింది. ఈ దృశ్యాన్ని చూసి చాలా మంది షాక్ అయ్యారు. అయితే, ఆలయం వెనుక గాంధీ సరోవర్ కారణంగా, హిమపాతం అక్కడ ఆగిపోయింది. ముందుకు కదలలేదు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. కేదార్‌నాథ్ ఆలయానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఆలయం కూడా పూర్తిగా సురక్షితంగా ఉంది.

ఇవి కూడా చదవండి

కాగా, కేదార్‌నాథ్‌ ఆలయం వెనుక ఉన్న గాంధీ సరోవర్ కొండలపై నుంచి హిమపాతం జారిపడటం చూసి భక్తులు, స్థానికులు ఆందోళన చెందారు. అయితే ఈ పర్వతంపై హిమపాతాలు సంభవించడం అసాధారణం కాదని విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్‌వార్ తెలిపారు. ఈ పర్వతంపై అప్పుడప్పుడు ఇలాంటి హిమపాతాలు జారుతుంటాయని చెప్పారు. కొండలపై బాగా మంచు పేరుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అన్నారు. అయితే ఈ హిమపాతాలు ఎలాంటి నష్టం కలిగించవని వెల్లడించారు. మరోవైపు కేదార్‌నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం దూసుకొచ్చిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో