K9-Vajra: కదనరంగంలో దిగిన కే9 వజ్రా యుద్ధ ట్యాంకులు.. ల‌డాఖ్‌లో మోహ‌రించిన ఇండియ‌న్ ఆర్మీ.. వీడియో..

K9-Vajra self-propelled howitzer: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల అనంతరం.. తూర్పు ల‌డాఖ్‌లోని నియంత్రణ రేఖ వ‌ద్ద ఇండియా

K9-Vajra: కదనరంగంలో దిగిన కే9 వజ్రా యుద్ధ ట్యాంకులు.. ల‌డాఖ్‌లో మోహ‌రించిన ఇండియ‌న్ ఆర్మీ.. వీడియో..
K9 Vajra
Follow us

|

Updated on: Oct 02, 2021 | 2:11 PM

K9-Vajra self-propelled howitzer: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల అనంతరం.. తూర్పు ల‌డాఖ్‌లోని నియంత్రణ రేఖ వ‌ద్ద ఇండియా కొత్త ఆయుధాలను మోహ‌రించింది. చైనా స‌రిహ‌ద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువ‌ల్ కంట్రోల్ వ‌ద్ద తొలిసారి కే9- వ‌జ్రా హోవిట్జర్ యుద్ధ ట్యాంకులను ఇండియ‌న్ ఆర్మీ మోహరించింది. కే9-వ‌జ్రా గ‌న్ సుమారు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న శుత్రు లక్ష్యాలను ధ్వంసం చిల్చీచెండాడుతుంది. కే9-వ‌జ్రా హోవిట్జర్ చెందిన రెజిమెంట్‌ను మొత్తాన్ని ల‌డాఖ్‌లో మోహ‌రించిన‌ట్లు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వాణే వెల్లడించారు. కే9 వ‌జ్రా ఆయుధాలు హై ఆల్టిట్యూడ్ ఏరియాల్లోనూ పనిచేస్తాయ‌ని తెలిపారు. ఫీల్డ్ ట్రయల్స్, యుద్ధ స‌మ‌యంలో హోవిట్జర్ గ‌న్నులు చాలా స‌క్సెస్ రేటును చూపించిన‌ట్లు నరవాణే వివరించారు. కే9 రెజిమెంట్‌ను పూర్తిగా మోహ‌రించ‌డం వ‌ల్ల కలిగే లాభాలను మ‌నోజ్ ముకుంద్ వివరించారు.

గ‌త ఆరు నెల‌ల నుంచి ల‌డాఖ్‌లో ప‌రిస్థితి ప్రశాంతంగా నరవాణే తెలిపారు. అక్టోబ‌ర్ రెండ‌వ వారంలో చైనా సైనిక ద‌ళాల‌తో 13వ రౌండ్ చర్చలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయన్నారు. ఈ చర్చల్లో ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌, పలు అంశాలపై ఏకాభిప్రాయం వచ్చే అవకాశముందని తెలిపారు. అన్ని సమస్యాత్మక ప్రాంతాల‌ను క్లియ‌ర్ చేస్తున్నామని.. వెల్లడించారు. చైనాతో నెల‌కొన్న ప్రతిష్టంభన, ఉద్రికత్త పరిస్థితులు చర్చల ద్వారానే ప‌రిష్కారం అవుతాయ‌ని తెలిపారు. ఈస్ట్రన్ ల‌డఖ్‌ తదితర ప్రాంతాల్లో చైనా త‌న సైన్యాన్ని పెంచిందని ఇది కొంత ఆందోళ‌న‌క‌ర‌మైన అంశ‌మ‌ని న‌ర‌వాణే తెలిపారు.

Also Read:

Bathukamma Sarees: ఆడపడుచులకు బతుకమ్మ చీరలు.. పల్లె, పట్టణ, నగరాల్లో జోరుగా పంపిణీ