Nithyananda: తన ఆరోగ్య పరిస్థితిపై, జీవ సమాధిపై పూర్తి క్లారిటీ ఇచ్చిన నిత్యానంద.. ఏమన్నారంటే..?
తనకు తాను భగవంతునిగా ప్రకటించుకున్న వివాదాల నిత్యానంద స్వామి.. ఆరోగ్య పరిస్థితి గురించి.. జీవ సమాధి గురించి.. ఇటీవలి కాలంలో చాలా వార్తలు వైరల్ అవతున్నాయి. తాజాగా వీటిపై నిత్యానంద కార్యలయం నుంచి స్పష్టత వచ్చింది.

స్వామి నిత్యానంద జీవ సమాధి అవుతున్నారా….. నిత్యానంద తరువాత వేల కోట్ల ఆస్తులను ఎవరు కాపాడతారు … నిత్యానంద ప్రియ శిష్యురాలు రంజిత(actress Ranjitha) రాజమాతగా కైలాసంలో కొనసాగుతారా ….అక్కడ చక్రం తిప్పుతారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. వీటికి సంబంధించి నిత్యానందే స్వయంగా ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని చెబుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అన్ని మెడికల్ రికార్డ్స్‌ని త్వరలోనే ప్రపంచం ముందు పెడతానని వెల్లడించారు. సమాధిలో ఉంటూనే వైద్యులకి సహకరిస్తున్నానన్నారు. తన ఆరోగ్య సమస్యలు త్వరలోనే తీరిపోతాయని నిత్యానంద చెబుతున్నారు. భక్తులకు త్వరలోనే తన దర్శన భాగ్యం ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇస్తున్నారు. కైలాస(kailasa) ఆశ్రమానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు యధావిధిగా జరుగుతున్నాయని.. వాటిని ఆయా కమిటీలు పర్యవేక్షిస్తున్నట్లు నిత్యానంద తెలిపారు. సమాధిలో ఉండటం.. శరీరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను తొలగించుకోవడానికి ఓ యోగ ప్రక్రియలాంటిదని చెప్పుకొచ్చారు. సమాధిలోకి వెళ్లడమంటే చాలామంది పొరబడుతున్నారని.. తన శక్తిని పెంచుకోవడానికి ఇది ఒక ప్రయత్నమని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




