Kerala: ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించొచ్చు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
కేరళ హై కోర్టు(Kerala High Court).. ఈ పేరు చెబితే చాలు. ఎన్నో సంచలన తీర్పులు గుర్తుకు వస్తాయి. లైంగిక వేధింపులు, దాడులు వంటి కేసుల్లో అసాధారణ తీర్పులు వెలువరుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పరస్పరం అంగీకారంతో విడాకులు....

కేరళ హై కోర్టు(Kerala High Court).. ఈ పేరు చెబితే చాలు. ఎన్నో సంచలన తీర్పులు గుర్తుకు వస్తాయి. లైంగిక వేధింపులు, దాడులు వంటి కేసుల్లో అసాధారణ తీర్పులు వెలువరుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి నిరాకరించడం నేరం లాంటిదేనని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరవడం నేరం కాదని, పురుషుడి అవయవంతో అమ్మాయి శరీరాన్ని ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందకే వస్తుందని ఇలా వివిధ సందర్భాల్లో సంచలనాత్మక తీర్పులు వెల్లడించింది. అయితే తాజాగా ఇచ్చిన ఓ తీర్పు మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించొచ్చని తీర్పునిచ్చింది. సాధారణంగా మన దేశంలో ఇద్దరు అబ్బాయిలు గానీ ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించడాన్ని సమాజం అంగీకరించదు. ఇలాంటి సంస్కృతి విదేశాల్లో ఉన్నప్పటికీ మన దేశంలో మాత్రం లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ హై కోర్టు ఇచ్చిన తీర్పు పెను సంచలనంగా మారింది.

సౌదీ అరేబియాలో చదువుకునే సమయంలో అదిలా, ఫాతిమా అనే ఇద్దరు అమ్మాయిల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. కొద్దిరోజులు వారు సహజీవనం కూడా చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఇలా చేయడం తప్పని వారించారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. దీంతో అదిలా మే 19న కోజికోడ్‌కు వెళ్లి ఫాతిమాను కలిసింది. అక్కడి షెల్టర్ హోమ్‌లో ఇద్దరూ ఆశ్రయం తీసుకున్నారు. వారు అక్కడున్నారన్న సమచారాన్ని వారి బంధువులు తెలుసుకున్నారు. ఈ సమయంలో ఫాతిమాను అలువలోని తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. అనంతరం కొద్దిరోజులకు ఫాతిమా బంధువులు అలువాకు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు.

Kerala High Court Woman
ఈ విషయంపై అదిలా.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తర్వాత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం వారిద్దరూ కలిసి ఉండేలా తీర్పు వెలువరించింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి



