ముంబై జైల్లో కరోనా ‘కలకలం’, ఇంద్రాణి ముఖర్జియా సహా 39 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్

ముంబై జైల్లో కరోనా 'కలకలం', ఇంద్రాణి ముఖర్జియా సహా 39 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్
Indrani Mukerjea

షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషిఇంద్రాణి ముఖర్జియా సహా 39 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్ సోకింది.  ముంబై లోని బైకుల్లా జైల్లో వీరికి రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించగా  వీరు  కరోనా  పాజిటివ్ బారిన పడినట్టు తేలిందని   జైలు అధికారి ఒకరు తెలిపారు.

Umakanth Rao

| Edited By: Phani CH

Apr 21, 2021 | 7:14 PM

షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషిఇంద్రాణి ముఖర్జియా సహా 39 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్ సోకింది.  ముంబై లోని బైకుల్లా జైల్లో వీరికి రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించగా  వీరు  కరోనా  పాజిటివ్ బారిన పడినట్టు తేలిందని   జైలు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఖైదీల్లో  చాలామందికి ఎసింప్టోమాటిక్  లక్షణాలు ఉన్నాయని, అయినప్పటికీ  ముందు  జాగ్రత్త చర్యగా  వీరిని  మరో  జైలులోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించామని  ఆయన చెప్పారు. ఈ   ఖైదీల్లో ఒకరికి ఈ నెల 18 న రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించగా ఈమె కరోనా  పాజిటివ్ కి గురైనట్టు  తెలిసిందని,  దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించామని ఆయన వెల్లడించారు. ఈ జైల్లోని 350 మంది మహిళా ఖైదీలకు, 225 మంది మగ ఖైదీలకు, 60 మంది జైలు సిబ్బందికి టెస్టులను నిర్వహించారు. వీరిలో 40 మంది పాజిటివ్ కి గురయ్యారు.

2012 లో వరుసకు తన కూతురైన షీనా బోరాను హతమార్చినందుకు ఇంద్రాణి ముఖర్జియాను 2015 లో పోలీసులు అరెస్టు చేశారు.   అప్పటి నుంచి ఈమె  బైకుల్లా జైల్లో శిక్ష అనుభవిస్తోంది. తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా,  తరువాత పీటర్ ముఖర్జియాతో కలిసి ఈమె షీనా బోరాను మర్డర్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచార  కోర్టుల్లో చాలా నెలలపాటు  కొనసాగింది. అప్పట్లో ఈ ఘటన దేశంలో పెద్ద సంచలన మైందికూడా.  ఒక దశలో  ఇంద్రాణి ముఖర్జియాకు బెయిల్ లభించినప్పటికీ   ఆ తరువాత మళ్ళీ జైలు ముఖం పట్టక తప్పలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: Cucumber: కీరదోస తినంగానే.. నీళ్లు తాగుతున్నారా..? అయితే రోగాలను కొనితెచ్చుకున్నట్లే.. ఎందుకంటే

మీకు ఎస్‌బీఐలో రుణాలు ఇప్పిస్తామని ఫోన్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త…వెలుగులోకి వస్తున్న మోసాలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu