Cucumber: కీరదోస తినంగానే.. నీళ్లు తాగుతున్నారా..? అయితే రోగాలను కొనితెచ్చుకున్నట్లే.. ఎందుకంటే

drinking water after eating cucumber: వేసవిలో శరీరం తరచూ డీహైడ్రేషన్‌కు గువరుతుంటుంది. దీంతో చాలామంది వడదెబ్బకు గురవుతుంటారు. అంతేకాకుండా

Cucumber: కీరదోస తినంగానే.. నీళ్లు తాగుతున్నారా..? అయితే రోగాలను కొనితెచ్చుకున్నట్లే.. ఎందుకంటే
Cucumber
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 21, 2021 | 7:10 PM

drinking water after eating cucumber: వేసవిలో శరీరం తరచూ డీహైడ్రేషన్‌కు గువరుతుంటుంది. దీంతో చాలామంది వడదెబ్బకు గురవుతుంటారు. అంతేకాకుండా పలు రోగాల బారిన పడుతుంటారు. అయితే వాటి నుంచి తప్పించుకోవడానికి, శరీరం హైడ్రేట్ గా ఉండటానికి కీర దోసకాయ తింటుంటారు. ఇది తినడం కూడా శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. కీరదోస అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఈ కీరదోసను ఎక్కువగా సలాడ్‌లో ఉపయోగిస్తారు. ఈ దోసకాయలో అనేకరకాల పోషకాలు ఉన్నాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. దీంతోపాటు డయాబెటిస్‌ను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. కావున వేసవిలో దోసకాయను తినడం మంచిదని పేర్కొంటున్నారు నిపుణులు.

వెంటనే నీరు ఎందుకు తాగకూడదంటే..?

అయితే కీర దోసకాయను తినడం ఆరోగ్యానికి మేలే కానీ.. తిన్న తర్వాత నీరు తాగకూడదన్న విషయం చాలా మందికి తెలియదు. దోసకాయ తిన్న తర్వాత అరగంట వరకు నీరు తాగొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. ఏదైనా ఆహారం జీర్ణం కావడానికి పేగులల్లో పిహెచ్ స్థాయి అవసరం. అయితే కీరదోస తిన్న వెంటనే నీరు తాగితే.. పిహెచ్ స్థాయి బలహీనపడి ఆహారం అరుగుదల ఉండదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియకు సహకరించే ఆమ్లాలు ఉత్పత్తి కావు. దీనివల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి.

80శాతం నీరే..

కీరదోసలో 80 శాతం నీరు ఉంటుంది. అంటే ఇవి తినడం వల్ల శరీరానికి తగినంత నీరు లభిస్తుంది. దీంతోపాటు వీటిలో ఉన్న విటమిన్లు, కేలరీలు శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. కీర దోసం నిత్యం తినడం వల్ల శరీరంలో కొవ్వు ఏర్పడదు. దీంతో బరువును కూడా తగ్గవచ్చు. కావున రోజుకు ఒక్కసారైనా దోసకాయ తినాలి.

చర్మానికీ మేలే..

వేసవిలో అందరి చర్మం పొడిగా ఉంటుంది. కీరదోసకాయలల్లో సిలికాన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ మూడు పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. దీంతోపాటు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. దోసకాయలలో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Also Read:

Coronavirus Symptoms: మీకు ఈ విధంగా దగ్గు వస్తుందా..? అయితే కరోనా లక్షణాలే కావొచ్చు.. ఎందుకంటే..?

Cocaine Seized: సముద్ర తీరంలో అక్రమ దందా.. అక్రమార్కుల గుట్టురట్టు.. తూత్తుకుడిలో రూ.1500 కోట్ల కొకైన్‌ పట్టివేత