Cocaine Seized: సముద్ర తీరంలో అక్రమ దందా.. అక్రమార్కుల గుట్టురట్టు.. తూత్తుకుడిలో రూ.1500 కోట్ల కొకైన్‌ పట్టివేత

ఎయిర్‌పోర్టులు బంగారం స్మగ్లింగ్‌కు కేరాఫ్‌లు అయితే.. పోర్టులు డ్రగ్స్‌ సరఫరాకు అడ్డాలవుతున్నాయి. తమిళనాడులో మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టుబట్టాయి.

Cocaine Seized: సముద్ర తీరంలో అక్రమ దందా.. అక్రమార్కుల గుట్టురట్టు..  తూత్తుకుడిలో రూ.1500 కోట్ల కొకైన్‌ పట్టివేత
Cocaine Seized In Thoothukudi Fort
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 21, 2021 | 6:39 PM

Cocaine Seized: ఎయిర్‌పోర్టులు బంగారం స్మగ్లింగ్‌కు కేరాఫ్‌లు అయితే.. పోర్టులు డ్రగ్స్‌ సరఫరాకు అడ్డాలవుతున్నాయి. తమిళనాడులో మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టుబట్టాయి. వేల కోట్ల విలువైన మత్తు పదార్ధాలు ఇతర దేశాల నుంచి రవాణా చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

తమిళనాడులోని తూత్తుకుడిలోని వీవోసీ పోర్టులో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కోట్ల రూపాయల విలువైన కొకైన్‌‌ను రెవిన్యూ ఇంటిలిజెన్స్‌ డైరెక్టరేట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి వచ్చిన నౌక ద్వారా ఈ మత్తుపదార్ధాలు రవాణ చేస్తుండగా సీజ్‌ చేశారు. ఇటీవల పోర్టుకు వచ్చిన ఓ నౌకలోని కంటైనర్లను అధికారులు తనిఖీ చేస్తుండగా స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడింది. టింబర్‌ కంటైనర్‌లో ఉన్న బ్యాగుల్లో సుమారు 4వందల కేజీలు కొకైన్‌ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

కొకైన్‌‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భారీగా వచ్చిన నార్కోటిక్‌ పదార్ధాలు ఏ ప్రాంతం నుంచి ఎవరికి పంపించారన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కంటైనర్‌ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు ఆర్డర్‌ చేశారు.. ఇందులో డ్రగ్స్‌ ఎవరు పెట్టారన్నది నిగ్గు తేల్చే పనిలో పడ్డారు చెన్నై అధికారులు. మరోవైపు పోర్టులో ఉద్యోగులు, అటు నౌక సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అటు, ఇప్పటికే ఎయిర్‌పోర్టులు గోల్డ్‌ స్మగ్లింగ్‌ హబ్‌లుగా మారితే.. పోర్టులు ఏకంగా డ్రగ్స్‌ రవాణా హబ్‌లుగా మారుతున్నాయి. తమిళనాడు ఎయిర్‌పోర్టులో ఇటీవలకాలంలో జరిపిన సోదాల్లో అక్రమంగా తరలిస్తున్న వందల కేజీల బంగారం బయటపడింది. తాజాగా షిప్పింగ్‌ పోర్టులో డ్రగ్స్‌ రవాణా పెరిగింది. తరచుగా డ్రగ్స్‌ రవాణా చేస్తుండగా సీజ్‌ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్‌ రవాణా జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతపెద్ద మొత్తంలో పట్టుకోవడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. 4వందల కిలోల కొకైన్‌ వాల్యూ దాదాపు 1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.