Family killed: ఛత్తీస్‌గడ్‌లో దారుణం.. మాజీ డిప్యూటీ సీఎం ప్యారేలాల్ కుటుంబసభ్యుల హత్య.. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి..!
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ప్యారేలాల్ కన్వర్‌కి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు దారుణహత్యకు గురయ్యారు.
Three family members murdered: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ప్యారేలాల్ కన్వర్‌కి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కోర్బాలోని ఓ గ్రామంలో ప్యారేలాల్ కన్వర్ కుమారుడు, కోడలు, ఐదేళ్ల మనవరాలి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధాలతో దుండగులు వారిపూపై దాడి చేసిన విచక్షణారహితంగా చంపినట్టు పోలీసులు పేర్కొన్నారు.
మృతి చెందిన వారిని హరీశ్ కన్వార్, సుమిత్ర కన్వార్, ఆషి కన్వార్ (5) తమ ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ దారుణానికి సంబంధించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని కోర్బా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు. కాగా, ఈ విషయం తెలియగానే రెవెన్యూ మంత్రి జైసింగ్ అగర్వాల్ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also.. Hen dead Suddenly: పోలీస్ మెట్లు ఎక్కిన కోడి పంచాయతీ… నా కోడిని చంపేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు