నాసిక్ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా

మహారాష్ట్ర నాసిక్ లోని మున్సిపల్ ఆసుపత్రిలో  ఆక్సిజన్ లీకేజీ ఘటనపై విచారణకు ప్రభుత్వం ముగ్గురు  సభ్యులతో కమిటీని  నియమించింది.

నాసిక్ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
Nashik Oxygen Leak Incident
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 21, 2021 | 7:59 PM

మహారాష్ట్ర నాసిక్ లోని మున్సిపల్ ఆసుపత్రిలో  ఆక్సిజన్ లీకేజీ ఘటనపై విచారణకు ప్రభుత్వం ముగ్గురు  సభ్యులతో కమిటీని  నియమించింది.ఈ  ఘటనలో 22  మంది  ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది పురుషులు, ఇంతే  సంఖ్యలో మహిళలు ఉన్నారు. వీరికి వెంటిలేటర్ పై చికిత్స జరుగుతోందని, ఆక్సిజన్ స్టోరేజీ ప్లాంట్ లో లీకేజీ కారణంగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. ఈ ఆసుపత్రిలో 150 మంది రోగులు అడ్మిట్  అయ్యారని,వీరిలో 23 మంది వెంటిలేటర్ సపోర్టు పైన,  మిగిలినవారికి ఆక్సిజన్ సపోర్టు పైన చికిత్స అందిస్తున్నారని అధికారులు  చెప్పారు.  కాగా ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్  థాక్రే   తీవ్ర సంతాపం వ్యక్తం  చేశారు.  మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియాను   చెల్లిస్తామని  ఆయన తెలిపారు. స్టోరేజీ ట్యాంక్ నుంచి లీకేజీ కారణంగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయినట్టు  తెలుస్తోంది. అటు- ఈ ఘటన  నిర్లక్ష్యం వల్ల జరిగిందా  లేక  మరేదైనా  కారణమా అన్నది తేలాల్సి ఉందని  ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోప్ వ్యాఖ్యానించారు.

తమవారు మత్యువాత పడ్డారని తెలియగానే   ఆ కుటుంబాల సభ్యుల రోదనలతో అక్కడ విషాద  వాతావరణం  నెలకొంది. వీరిని, అక్కడ గుమికూడిన స్థానికులను తొలగించడానికి పోలీసులు నానా  పాట్లు పడ్డారు. స్టోరేజీ ట్యాంకును భర్తీ చేస్తుండగా ఆక్సిజన్ లీక్ అయినట్టు భావిస్తున్నామని, విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని నాసిక్ పోలీస్  కమిషనర్ దీపక్ పాండే చెప్పారు…

మరిన్ని ఇక్కడ చూడండి: చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హీరోయిన్.. తండ్రితో ఉన్న త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన ముద్దుగుమ్మ..

CM K Chandrashekar rao : సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి సీఎం కేసీఆర్, కరోనా చికిత్సలో భాగంగా రాక