మే 1 నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో పెరగనున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర, ఎంతంటే ?

మే 1 నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో పెరగనున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర, ఎంతంటే ?
Covishield.

సీరం కంపెనీఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర మే 1 నుంచి  పెరగబోతోంది.ప్రైవేటు ఆసుపత్రుల్లో  ప్రజలు దీనికి  600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Umakanth Rao

| Edited By: Phani CH

Apr 21, 2021 | 8:58 PM

సీరం కంపెనీఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర మే 1 నుంచి  పెరగబోతోంది.ప్రైవేటు ఆసుపత్రుల్లో  ప్రజలు దీనికి  600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ హాస్పిటల్స్ లో ఈ నెలలో మొదటి డోసు 250 రూపాయలు చెలించినవారు కూడా ఇకపై రెండో డోసుకు ఇంత ధర (600  రూ.లు)  పెట్టాల్సిందే.. మొదటి డోసు తీసుకున్న ఆరు వారాల నుంచి 8 వారాల్లోగా రెండో డోసు తీసుకోవడం తప్పనిసరి.. వచ్చే నెల 1 నుంచి సరళీకృత నేషనల్ కోవిడ్ వ్యాక్సిన్ స్ట్రాటజీ అమలులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. దీని  కింద  ఉత్పత్తిదారులు తమ నెలవారీ డోసుల్లో 50 శాతాన్ని రాష్ట్రాలకు,  ఓపెన్ మార్కెట్ కి సప్లయ్ చేయాల్సి ఉంటుంది.  తాము  రాష్ట్రాలకు 400  రూపాయల  చొప్పున,ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయల చొప్పున అమ్ముతామని సీరం సంస్థ  బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ 250 రూపాయల చొప్పున ప్రజలకు ఇస్తున్నారు. సీరం సంస్థ నుంచి నేరుగా సేకరిస్తున్న కేంద్రం దీన్ని సబ్సిడీ రేటుగా పేర్కొంటోంది.  సరళీకృత  అమలులోకి  వస్తే 250  రూపాయల ధరకు కాలం చెల్లినట్టే.

కాగా ఇదంతా చూస్తుంటే ఈ  కరోనా సెకండ్ వేవ్ లో  ప్రజల ఆరోగ్యం మీద  ఉత్పత్తిదారులు బిజినెస్ చేస్తున్నట్టే ఉందని అంటున్నారు.  ప్రభుత్వ ఆస్పత్రుల ముందు వ్యాక్సిన్ కోసం ప్రజలు చాంతాడంత క్యూల్లో గంటల తరబడి వేచి చూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Super Woman: సూపర్ మార్కెట్ లో ఎస్కలేటర్ మీద చక్రాల కుర్చీతో సహా జారిపోతున్న వృద్ధుడు..అప్పుడు ఓ మహిళ ఏం చేసిందంటే..

Andhra Pradesh : పిడుగులాంటి వార్త, ఆంధ్రప్రదేశ్ లో వివిధ పెన్షన్ల లబ్దిదారులపై సర్కారు నజర్, కొత్త రూల్స్ తో కోత. !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu