Andhra Pradesh : పిడుగులాంటి వార్త, ఆంధ్రప్రదేశ్ లో వివిధ పెన్షన్ల లబ్దిదారులపై సర్కారు నజర్, కొత్త రూల్స్ తో కోత. !
Andhra Pradesh welfare schemes : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారుల విషయంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh welfare schemes : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారుల విషయంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అసలైన లబ్దిదారులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బోగస్ లబ్దిదారులు ఎక్కువ ఉన్నారన్న అంశంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. వైఎస్‌ఆర్ పింఛను కానుకలో భాగంగా కులవృత్తులు, మెడికల్ విభాగాల అర్హుల్ని గుర్తించేందుకు కొత్త నిబంధనలు పొందుపర్చింది. పెన్షన్ పొందాలంటే తప్పనిసరిగా దరఖాస్తుదారులు వారి కులవృత్తియే జీవనాధారం చేసుకొని ఉండాలని కొత్త ఉత్తర్వుల్లో పేర్కొంది. మెడికల్, ఒంటరి పెన్షన్ల విషయంలోనూ ఇక, కఠినమైన రూల్స్ పాటించబోతోంది. వీటికి అవసరమైన పత్రాలను ఎక్సైజ్, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సంక్షేమ కార్యదర్శులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారులకు అందజేస్తారు.
లబ్ధిదారుల వృత్తికి జియోట్యాగింగ్ చేసి వారి లాగిన్లు ద్వారా తిరిగి శాఖాధికారుల పరిశీలనకు పంపించాలి. అక్కడ అనుమతి లభించిన దరఖాస్తులకే ఎంపీడీవో, పురపాలిక అధికారులు మంజూరుకు సిఫార్సు చేస్తారు. ఈ ప్రక్రియను 21 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో 61.28 లక్షల మంది వివిధ ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులుగా ఉన్నారు.
Read also : CM K Chandrashekar rao : సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి సీఎం కేసీఆర్, కరోనా చికిత్సలో భాగంగా రాక
కరోనాను జయించిన మొదటి దేశం ఇదే … మాస్కులు వేసుకోనక్కర్లేదని అధికారికంగా ప్రకటన
SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..
Coronavirus Symptoms: మీకు ఈ విధంగా దగ్గు వస్తుందా..? అయితే కరోనా లక్షణాలే కావొచ్చు.. ఎందుకంటే..?