Corona Pandemic: కర్ఫ్యూ కట్టుబాట్లు.. కరోనా ఇబ్బందులు.. ఉత్తరప్రదేశ్ లో బ్యాంకుల పనివేళల కుదింపు

కరోనా కల్లోలం పెరిగిపోతోంది . ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడమే సరైన పనిగా చెబుతున్నారు. ఇక ఉద్యోగుల భద్రత విషయంలో ఆయా సంస్థలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.

Corona Pandemic: కర్ఫ్యూ కట్టుబాట్లు.. కరోనా ఇబ్బందులు.. ఉత్తరప్రదేశ్ లో బ్యాంకుల పనివేళల కుదింపు
Bank Deposits
Follow us

|

Updated on: Apr 21, 2021 | 9:14 PM

Corona Pandemic: కరోనా కల్లోలం పెరిగిపోతోంది . ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడమే సరైన పనిగా చెబుతున్నారు. ఇక ఉద్యోగుల భద్రత విషయంలో ఆయా సంస్థలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ తొ ఎక్కువ సంబంధాలుండే సంస్థలు తమ ఉద్యోగుల కోసం తీసుకోవలసిన జాగ్రత్తల పై దృష్టి సారించాయి. ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్నకరోనా పరిస్థితుల్లో బ్యాంకుల పని విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి బ్యాంకులు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసి) ఉత్తరప్రదేశ్ శాఖ ఈ మేరకు పలు సూచనలు బ్యాంకులకు చేసింది. దీని ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో బ్యాంకుల పనివేళలు.. ఇతర విషయాలపై తీసుకున్న చర్యలు ఇవీ..

  • ఉత్తరప్రదేశ్ లో బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ మాత్రమె పని చేస్తాయి.
  • బ్యాంకు కస్టమర్లకు పరిమిత సంఖ్యలోనే సేవలు అందుతాయి. నగదు జమ చేయడం.. తీసుకోవడం, చెక్ క్లియరెన్స్, ప్రభుత్వ సర్వీసులు ఇందులో ఉన్నాయి.
  • కేవలం సగం మంది సిబ్బంది మాత్రమే బంకుల్లో పని చేస్తారు. మిగిలిన వారికి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇస్తారు. ఈ మార్గాదర్శాకాలు అమలులో ఉన్నంత వరకూ సిబ్బందిని రొటేట్ చేస్తారు.
  • కరెన్సీ చెస్ట్, ఏటీఎం, సెక్యూరిటీ, డాటా ఆపరేషన్, సైబర్ సెక్యూరిటీ, క్లియరింగ్ హౌస్, బ్యాంకు ట్రెజరీ లు మామూలుగానే పని చేస్తాయి.
  • ఈ విధమైన ఏర్పాటు ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకూ ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ నిబంధనలు అనుకూలించాకపోతే, ఈ తేదీ పొడిగించే అవకాశం ఉంది.
  • జిల్లా స్థాయిలో ప్రభుత్వ వర్గాలు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దానికి అనుగుణంగా బ్యాంకుల పనితీరు మారుతుంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అనుగుణంగా బ్యాంకులు పని చేస్తాయని ఎస్ఎల్బీసి తెలిపింది. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో ప్రజలు కూడా బ్యాంకు అధికారులకు సహకరించాలని కోరారు. అత్యవసరమైన పనులుంటే తప్ప బ్యాంకు శాఖలను సందర్శించవద్దనీ.. ఆన్ లైన్ బ్యాంకింగ్ వ్యవస్థను సమర్ధవంతంగా వినియోగించుకోవలనీ వారు కోరారు.

Also Read: Super Woman: సూపర్ మార్కెట్ లో ఎస్కలేటర్ మీద చక్రాల కుర్చీతో సహా జారిపోతున్న వృద్ధుడు..అప్పుడు ఓ మహిళ ఏం చేసిందంటే..

నాసిక్ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా