AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Woman: సూపర్ మార్కెట్ లో ఎస్కలేటర్ మీద చక్రాల కుర్చీతో సహా జారిపోతున్న వృద్ధుడు..అప్పుడు ఓ మహిళ ఏం చేసిందంటే..

స్కలేటర్ మీద వీల్ చైర్లో ఉన్న ఒక వృద్ధుడు పడిపోకుండా ఒక మహిళ కాపాడిన సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Super Woman: సూపర్ మార్కెట్ లో ఎస్కలేటర్ మీద చక్రాల కుర్చీతో సహా జారిపోతున్న వృద్ధుడు..అప్పుడు ఓ మహిళ ఏం చేసిందంటే..
Super Woman
KVD Varma
|

Updated on: Apr 21, 2021 | 8:56 PM

Share

Super Woman: ఎస్కలేటర్ మీద వీల్ చైర్లో ఉన్న ఒక వృద్ధుడు పడిపోకుండా ఒక మహిళ కాపాడిన సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సూపర్ మార్కెట్ లో ఒక వృద్ధుడు ఉన్న వీల్ చైర్ కదిలే మెట్లపైకి వచ్చేసింది. ఆ వృద్ధుడు కేకలు వేయడం విన్న ఒక మహిళ వేగంగా అక్కడకు పరిగెత్తింది. ఆ వృద్ధుడు పడిపోకుండా కాపాడింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాలో ఒక మహిళ సూపర్ మార్కెట్ కు వెళ్ళింది. అక్కడ తన బిల్ పే చేస్తోంది. ఈలోపు ఎస్కలేటర్ పై నుంచి ఒక వృద్ధుడు ఉన్న వీల్ చైర్ కిందికి జారిపోయింది. దానిని కంట్రోల్ చేయాల్సిన కుర్రాడు కూడా దానితో పాటు ఎస్కలేటర్ పై పడిపోయాడు. ఇది గమనించిన ఆ మహిళ అత్యంత వేగంగా పరిగెత్తి ఆ వృద్ధుడు వీల్ చైర్ నుంచి కిందపడకుండా ఆపగలిగింది. అదే సమయంలో వీల్ చైర్ తో పాటు కింద పడిపోయిన్ అకుర్రాడిని కూడా ఆమె రక్షించింది. ఈమె ఆ వృద్ధుడిని రక్షించడానికి వెళుతున్న సమయంలో కౌంటర్ లో ఉన్న సూపర్ మార్కెట్ సిబ్బంది (ఆమె కూడా మహిళే) పరిగెత్తింది.

నేను ఆ సమయంలో ఏమీ ఆలోచించలేదు. దానివలన నాకేమైనా జరుగుతుందేమో అనే ఆలోచనే లేదు. ఆ ముసలాయనను కాపాడటమే నాకు ప్రధానంగా కనిపించింది. అదృష్టవశాత్తూ ఆ ముసలాయనకు ఏమీ కాలేదు. ఆయన వీల్ చైర్ తో పాటు పడిపోయిన కుర్రాడికి మాత్రం చిన్న చిన్న గాయాలు అయ్యాయి అని ఆమె చెప్పింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.

Also Read: Andhra Pradesh : పిడుగులాంటి వార్త, ఆంధ్రప్రదేశ్ లో వివిధ పెన్షన్ల లబ్దిదారులపై సర్కారు నజర్, కొత్త రూల్స్ తో కోత. !

Indonesia: గల్లంతైన ఇండోనేషియా సబ్ మెరైన్.. అందులో 53 మంది! తీవ్రంగా వెదుకుతున్న నేవీ!