AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saniya Mirza: ముద్దుల కొడుకుతో సానియా మిర్జా ఆటలు.. సోషల్ మీడియాలో అభిమానుల కేరింతలు..Viral Video

సానియా మిర్జా.. టెన్నిస్ తారగా వేలాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆమె టెన్నిస్ ఆడుతుంటే ఆమె ప్రతి ఫోటో వైరల్ అయిపోయేది. ఇప్పుడు తల్లిగా తన కొడుకుతో కనిపిస్తున్న ఫోటోలు అంతకంటే ఎక్కువగా వైరల్ అయిపోతున్నాయి.

Saniya Mirza: ముద్దుల కొడుకుతో సానియా మిర్జా ఆటలు.. సోషల్ మీడియాలో అభిమానుల కేరింతలు..Viral Video
Sania Mirza With Her Son
KVD Varma
|

Updated on: Apr 21, 2021 | 10:14 PM

Share

Saniya Mirza: సానియా మిర్జా.. టెన్నిస్ తారగా వేలాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆమె టెన్నిస్ ఆడుతుంటే ఆమె ప్రతి ఫోటో వైరల్ అయిపోయేది. ఇప్పుడు తల్లిగా తన కొడుకుతో కనిపిస్తున్న ఫోటోలు అంతకంటే ఎక్కువగా వైరల్ అయిపోతున్నాయి. సానియా మిర్జా ఇటీవల కాలంలో బ్యాట్ పట్టుకోకపోయినా, ఆమె అభిమానులకు ఆమె పై అభిమానం తగ్గలేదు. సానియా మిర్జా తల్లి పాత్రలో ఇప్పుడు పిల్లవాడితో ఆడుకుంటూ ఉండటం చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

సానియా మిర్జా తన ముద్దుల తనయుడు ఇజహాన్ తొ కలిసి ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఆమె పెట్టిన ప్రతి ఫొటోకు అభిమానులు వావ్ అంటూ తమ సంతోషాన్ని కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అవి ఇంతకు ముందు షేర్ చేసిన ఫోటోల కంటె కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. వాటిని చూస్తె మాత్రం ఎవరైనా వావ్ అనాల్సిందే.

ఇజహాన్ తో కలిసి ఆడుకుంటున్న సానియా..

సానియా మిర్జా సోమవారం ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియో షేర్ చేశారు. దానిలో సానియా తన ముద్దుల తనయుడితో కలిసి సూపర్ మార్కెట్ ఆట ఆడుతున్నారు. ఆమె దుకాణానికి వచ్చిన వినియోగదారునిగా మారిపోయారు. ఇజహాన్ ఆ దుకాణం ఓనర్ గా ఉన్నాడు. సానియా రకరకాల ఆహార పదార్ధాలు, కూరగాయలు, పళ్ళు, కిరాణా సామాను ఇజహాన్ కు ఇచ్చారు. వాటిని ఇద్దరూ కలిసి కచ్చితంగా ఉన్నాయో లేవో స్కాన్ చేసి చూస్తూ కనిపించారు ఆ వీడియోలో. ”నువ్వు అందమైన చక్కని షాప్ కీపర్ అయినపుడు.. మనిద్దరం బోలెడంత నేర్చుకోవచ్చు ఇజహాన్.. ఇంటికి తిరిగి రావడం చాల సరదాగా ఉంది”. అని ఆమె ఆ వీడియోకు కాప్షన్ ఇచ్చారు.

ఇప్పటికే ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా చూశారు. కామెంట్లు వరదలా వచ్చి పడ్డాయి ఈ పోస్ట్ కి. ఈ పోస్టులో ఇజహాన్ అన్ని కూరగాయల పేర్లూ చెప్పేస్తుంటే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

Also Read: Corona Medicine: క్లినికల్ ట్రయల్స్ లో కరోనా వ్యాధి లక్షణాలు తగ్గించే కొత్త మందు పరిశోధనలు..త్వరలో అందుబాటులోకి!

Morning Time: మీరు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేయండి… రోజంతా హుషారుగా.. ఆరోగ్యంగా ఉంటారు