AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలనంగా మారిన సానియా మీర్జా లేఖ… ఆడుతుందా..! లేదా..! అభిమానుల్లో కొత్త అనుమానాలు

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసిన లెటర్ వైరల్ గా మారింది. ఈ లేఖలో సానియా తన అనుభవాలను రాసుకొచ్చింది. ఆ లేఖను ప్రపంచంలోని తల్లులందరికీ అంకితం చేసింది.

సంచలనంగా మారిన సానియా మీర్జా లేఖ... ఆడుతుందా..! లేదా..! అభిమానుల్లో కొత్త అనుమానాలు
Sanjay Kasula
| Edited By: |

Updated on: Nov 26, 2020 | 2:38 PM

Share

Sania Mirza : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసిన లెటర్ వైరల్ గా మారింది. ఈ లేఖలో సానియా తన అనుభవాలను రాసుకొచ్చింది. ఆ లేఖను ప్రపంచంలోని తల్లులందరికీ అంకితం చేసింది. గర్భధారణ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు.. కొడుకు పుట్టిన తర్వాత ఆమె పొందిన అనుభూతి.. వంటివి ఆ లేఖలో రాసుకొచ్చింది.

దైనందిన జీవితంలో సందిగ్ద పరిస్థితులను ఎదుర్కొంటున్న తల్లులందరికీ ఈ లేఖను అంకితం ఇస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత.. 2020 లో డబుల్స్ టైటిల్ గెలిచిన తర్వాత సానియా మళ్లీ టెన్నిస్ బ్యాట్ పట్టలేదు. తన కొడుకు ఇజాన్ కు జన్మనిచ్చిన తర్వాత ఆమె నెగ్గిన తొలి ట్రోఫీ ఇది.

ఇటీవలే ఆమె డిస్కవరీ ప్లస్ లో దిగ్గజ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గురించిన ఒక డిస్కవరీని చూసిన తర్వాత తనలో మెదిలిన భావాలను లేఖ రూపంలో రాసి దానిని సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసింది. ఈ లెటర్‌ చూసిన వారు సానియా ఇక టెన్నిస్‌ రాకెట్‌ పడుతుందా అని అనుమానిస్తున్నారు.

ఒకప్పుడు తన ఆటతో యూత్‌ను ఉర్రూతలూగించిన సానియా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక టైటిళ్లు నెగ్గింది. గ్రాండ్‌స్లామ్స్‌లో భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రతిభను కనబర్చింది. పెళ్లైన తర్వాత కూడా ఆటను కొనసాగించింది. అయితే సానియా లెటర్‌ తర్వాత ఆమె ఇక ఆడుతుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్